ఓటు వేస్తూ సెల్ఫీ దిగిన కాంగ్రెస్ నాయకురాలు

By Nagaraju TFirst Published Dec 7, 2018, 11:32 AM IST
Highlights

 ఓటు హక్కును వినియోగించుకునేటపుడు గోప్యత పాటించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధన ఉంది. ఒకవేళ గోప్యత పాటించకుండా బహిర్గతం చేస్తే దాన్ని నేరంగా పరిగణిస్తారు. పోలింగ్ బూత్ లో ఓటు వేస్తున్నట్లు చెప్పడం కానీ, ఓటు వెయ్యాలని అభ్యర్థించడం కానీ నేరంగానే కేంద్ర ఎన్నికల కమిషన్ పరిగణిస్తుంది. 
 

రాజస్తాన్: ఓటు హక్కును వినియోగించుకునేటపుడు గోప్యత పాటించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధన ఉంది. ఒకవేళ గోప్యత పాటించకుండా బహిర్గతం చేస్తే దాన్ని నేరంగా పరిగణిస్తారు. పోలింగ్ బూత్ లో ఓటు వేస్తున్నట్లు చెప్పడం కానీ, ఓటు వెయ్యాలని అభ్యర్థించడం కానీ నేరంగానే కేంద్ర ఎన్నికల కమిషన్ పరిగణిస్తుంది. 

ఇకపోతే పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్ ను కొన్ని రాష్ట్రాల్లో అనుమతించడం లేదు. పొరపాటున సెల్ ఫోన్ పట్టుకు వస్తే ఓటు వేసేందుకు ఎన్నికల సిబ్బంది అనుమతించడం లేదు. అయితే ఎన్నికల నియమ నిబంధలను పాటించాల్సిన ఓ బాధ్యత కలిగిన నాయకురాలు ఎన్నికల కమిషన్ నియమావళికి నీళ్లు వదిలారు. 

ఓటు వేస్తూ సెల్ఫీ దిగారు. అంతటితో ఆగలేదు. పోలింగ్ బూత్ లో తాను దిగిన సెల్ఫీని ట్విట్టర్ లో పోస్టు చేసి తాను కాంగ్రెస్ పార్టీకి ఓటేశానంటూ మరీ చెప్పుకొచ్చారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు పూనమ్ జి.గోయల్ పోలింగ్ బూత్ లో సెల్ఫీ తీసుకున్నారు. 

సెల్ఫీ తీసుకుని ఊరుకోలేదు. ఆ సెల్ఫీను ట్విట్టర్లో పోస్టు చేసి కాంగ్రెస్ కు ఓటేశానంటూ పోస్టు కూడా పెట్టేశారు. పూనమ్ జి.గోయల్ సెల్ఫీపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 

ఇకపోతే ఓటు వేస్తూ సెల్ఫీ దిగితే దానిని కేంద్ర ఎన్నికల కమిషన్ నేరంగా పరిగణిస్తుంది. అంతేకాదు ఆ ఓటును 17ఏ లో నమోదు చేస్తారు. ఆ ఓటు కౌంటింగ్ సమయంలో పరిగణలోకి రాదు.  

click me!