షాకింగ్: అంబులెన్స్‌లో షూస్ ట్రాన్స్‌పోర్టు.. వీడియో వైరల్.. డ్రైవర్ పై వేటు

Published : Feb 24, 2023, 03:36 PM IST
షాకింగ్: అంబులెన్స్‌లో షూస్ ట్రాన్స్‌పోర్టు.. వీడియో వైరల్.. డ్రైవర్ పై వేటు

సారాంశం

రాజస్తాన్‌కు చెందిన ఓ అంబులెన్స్ షూస్‌ను చేరవేసే పని చేస్తూ కనిపించింది. జైపూర్ నుంచి దౌసా జిల్లాకు షూస్ సంచులను ట్రాన్స్‌పోర్టు చేస్తున్న వీడియో వైరల్ కావడంతో డ్రైవర్ పై వేటు పడింది. అధికారులు ఆ డ్రైవర్‌ను తొలగించారు.  

న్యూఢిల్లీ: అంబులెన్స్ కనిపించగానే అక్కడి వాతావరణం గంభీరంగా మారుతుంది. రోడ్డు పై వెళ్లుతూ ఉంటే దానికి దారి ఇస్తారు. అలాంటి అంబులెన్స్‌లో ఓ డ్రైవర్ బూట్లను సరఫరా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అధికారుల దృష్టికి ఆ వీడియో చేరడంతో సదరు డ్రైవర్ పై వేటు పడింది. ఉద్యోగంలో నుంచి ఆ డ్రైవర్‌ను తొలగించారు.

రాజస్తాన్‌లోని దౌసా జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌కు చెందిన అంబులెన్స్ డ్రైవర్‌గా ఉన్న వ్యక్తి షూస్‌ను జైపూర్ నుంచి దౌసాకు ట్రాన్స్‌పోర్టు చేశాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో అతడిని డ్రైవర్‌గా తొలగించారు. దౌసా ప్రభుత్వ హాస్పిటల్ ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివరామ్ మీనా ఈ మేరకు ధ్రువీకరించారు. ఓ ఎన్జీవో నియమించిన ఆ డ్రైవర్‌ను తొలగించినట్టు వెల్లడించారు. ఈ ఘటన పై దర్యాప్తు చేయడానికి ఇప్పటికే ఒక కమిటీ వేసినట్టు వివరించారు. ఈ కమిటీ నివేదికను సమర్పించిన తర్వాత అతడిపై యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. 

Also Read: మళ్ళీ బైక్ ఎక్కిన సాయిధరమ్ తేజ్.. ప్రాణాలు రిస్క్ లో పెట్టి అంత వేగంతో రైడింగ్, వీడియో

అవసరమైతే సంబంధిత సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేస్తామని వివరించారు. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అని అన్నారు. గురువారం ఉదయం ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. ఈ ఘటనపై సరైన దర్యాప్తు చేపడతామని హామీ ఇస్తున్నట్టు వివరించారు.

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్