ఏ ప్రాంతం, మ‌తం ప‌ట్ల ప‌క్ష‌పాతం లేదు.. అందరికీ శాంతి, శ్రేయస్సు కావాలి : ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

Published : Feb 24, 2023, 03:02 PM IST
ఏ ప్రాంతం, మ‌తం ప‌ట్ల ప‌క్ష‌పాతం లేదు.. అందరికీ శాంతి, శ్రేయస్సు కావాలి : ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

సారాంశం

Dimapur: నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)తో కలిసి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. తిరిగి అధికారంలోకి రావాలని ఆశిస్తున్న ఎన్డీపీపీ 40 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాట్లాడుతూ.. ఎన్డీపీపీ-బీజేపీ కూటమిని గెలిపించాలనీ, నాగాలాండ్ కు సేవ చేసేందుకు తనకు మరో అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు.

Nagaland Election 2023: తాము ఏ మ‌తం, ప్రాంతం ప‌ట్ల ప‌క్ష‌పాతం వహించడంలేద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. అంద‌రికీ శాంతి, శ్రేయ‌స్సును క‌ల్పించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)తో కలిసి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. తిరిగి అధికారంలోకి రావాలని ఆశిస్తున్న ఎన్డీపీపీ 40 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాట్లాడుతూ.. ఎన్డీపీపీ-బీజేపీ కూటమిని గెలిపించాలనీ, నాగాలాండ్ కు సేవ చేసేందుకు తమకు మరో అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. తాము అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనుకుంటున్నామ‌ని చెప్పారు.

వివ‌రాల్లోకెళ్తే.. బీజేపీ, దాని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఏన్డీయే) భాగస్వామ్య పక్షాలు ఏ ప్రాంతానికి లేదా మతానికి ప‌క్ష‌పాతంగా లేవ‌నీ, అందరికీ శాంతి, శ్రేయస్సును తాము కోరుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అన్నారు. ''కోవిడ్ -19 మహమ్మారి సమయంలో, టీకాలు దేశంలోని ప్రతి మూలకు చేరేలా చూసుకున్నాము. మా ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు అందరికీ, ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం ఉద్దేశించినవి" అని నాగాలాండ్ ఎన్నికల ప్రచారం చివరి రోజున దిమాపూర్ లో జరిగిన ర్యాలీలో ఆయ‌న‌ అన్నారు. అలాగే, తిరుగుబాటు ప్రభావిత ప్రాంతాల్లో సాయుధ బలగాలకు విస్తృత అధికారాలు కల్పించే సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని నాగాలాండ్ నుంచి త్వరలోనే తొలగిస్తార‌నే ఆశాభావం వ్యక్తం చేశారు.

నాగాలాండ్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ, రాష్ట్ర వేగవంతమైన అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు కృషి చేస్తున్నందునే బీజేపీ, ఎన్డీపీపీలకు ప్ర‌జ‌ల నుంచి మంచి మద్దతు లభిస్తోందన్నారు. దశాబ్దాలుగా నాగాలాండ్ లో శాంతి, పురోగతి, అభివృద్ధిని సాధించడంలో కాంగ్రెస్ విఫలమైందని మోడీ విమర్శించారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ, దాని భాగస్వామ్య పక్షాలు రాష్ట్ర అభివృద్ది దిశగా కృషి చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్, దాని భాగస్వామ్య పక్షాలు ఓట్లను రాబట్టుకుని నాగాలాండ్, మిగిలిన ఈశాన్య రాష్ట్రాలను మరిచిపోయే విధానాన్ని అనుసరించాయ‌ని విమ‌ర్శించారు. ఈ ప్రాంతంలో సుస్థిరతకు, పురోగతికి ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి రిమోట్ ద్వారా నాగాలాండ్ ను నియంత్రించేదని విమ‌ర్శించారు. 

కాంగ్రెస్ పాలనలో ఈశాన్య రాష్ట్రాలను ఏటీఎంలా వాడుకున్నారనీ, ప్రభుత్వ ధనం ప్రజలకు చేరలేదనీ, అవినీతిపరులైన కాంగ్రెస్ నేతల జేబుల్లోకి వెళ్లిందంటూ ఆరోపించారు. పదేళ్ల క్రితం వరకు ఈ ప్రాంతంలో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఎవరూ ఊహించి ఉండరని తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజల కోసం ఖర్చు చేసిన డబ్బు దళారులకు ఎలాంటి కమీషన్ ఇవ్వకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరేలా చేశాయని వివ‌రించారు. గత తొమ్మిదేళ్లలో నాగాలాండ్ లో హింసాత్మక ఘటనలు 75 శాతం తగ్గాయని మోడీ చెప్పారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఏఎఫ్ ఎస్ పీఏను తొలగించినట్లు తెలిపారు.

"నాగాలాండ్, ఈశాన్య రాష్ట్రాల నుంచి ఏఎఫ్ ఎస్ ఎఫ్ ఏను తొలగించేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాం. ఈ ప్రాంతంలో బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వాల వల్లే రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు పరిష్కారమవుతున్నాయి. ఇది ప్రగతికి, శ్రేయస్సుకు దారితీస్తుంది. నాగాలాండ్ లో ఎన్డీపీపీ-బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే దోపిడీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని" ప్ర‌ధాని మోడీ  హామీ ఇచ్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం