'హిందూ రాష్ట్ర డిమాండ్లు పెరగడం వల్లే.. ఖలిస్తాన్ డిమాండ్ చేయాలని ధైర్యం వచ్చింది' : సిఎం అశోక్ గెహ్లాట్ 

By Rajesh KarampooriFirst Published Apr 1, 2023, 3:36 AM IST
Highlights

పంజాబ్‌లో అమృతపాల్ సింగ్ వంటి వేర్పాటువాదుల పెరుగుదలకు పాలక బిజెపి అనుసరిస్తున్న “హిందూ రాష్ట్ర” సిద్ధాంతమే కారణమని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు.

భారతదేశంలో మరోసారి హిందూ దేశంగా మారాలనే డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. పలువురు నేతలతో పాటు బాబాలు, ఋషులు కూడా ఈ డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ అంశంపై అశోక్ గెహ్లాట్ ప్రధాని నరేంద్ర మోదీ, సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌పై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ, మోహన్‌ భగవత్‌లు హిందూ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారని, అందుకే అమృతపాల్‌ సింగ్‌ లాంటి వారికి ఖలిస్తాన్‌ డిమాండ్‌ చేసే ధైర్యం చేశారని  సీఎం గెహ్లాట్‌ సంచలన ప్రకటన చేశారు. 

ఖలిస్థాన్ ఉద్యమమీ కొత్తదేమీ కాదు...ఈ డిమాండ్లను ఇందిరా గాంధీ సమయంలో కూడా లేవనెత్తారు, ఆమె ఖలిస్తాన్ ఏర్పాటును అనుమతించలేదని అన్నారు. ఇప్పుడు ఖలిస్తాన్ పేరుతో ఓ  కొత్త వ్యక్తి తెరమీదికి వచ్చాడు. నరేంద్ర మోదీ, మోహన్ భగవత్ హిందూ దేశం గురించి మాట్లాడితే.. ఆ వ్యక్తి  ఖలిస్తాన్ గురించి ఎందుకు మాట్లాడలేరని  ఆయన అన్నారు. 'హిందూ దేశం గురించి మీరు ఎలా మాట్లాడగలరు?' అని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. మతం పేరుతో ప్రజలను మభ్యపెట్టడం సులభం. హిందూ దేశం డిమాండ్ చేసే వారి వల్లే అమృతపాల్ సింగ్ లాంటి వాళ్లకు ఖలిస్తాన్ డిమాండ్ చేయవచ్చనే  ధైర్యం వచ్చింది. 

ముఖ్యమైన విషయం ఏమిటంటే, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ భరత్‌పూర్ డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తలతో సంభాషించడానికి వచ్చారు. కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. మత ప్రాతిపదికన కొత్త దేశాన్ని నిర్మించలేమని బీజేపీని ఉద్దేశించి అన్నారు. మోహన్ భగవత్, నరేంద్ర మోదీలు హిందూ రాష్ట్రం గురించి మాట్లాడినట్లు, అమృతపాల్ కూడా ఖలిస్తాన్ గురించి ఎందుకు మాట్లాడరని అన్నారు.

'సోనియా గాంధీ నన్ను ఎందుకు ముఖ్యమంత్రిని చేస్తారు?'

ఏ విషయంలోనైనా ప్రజలను విభజించవచ్చని, అయితే వారిని కలపడం చాలా కష్టమైన పని అని అశోక్ గెహ్లాట్ చెప్పారు. అదే సమయంలో రాజస్థాన్‌లో నివసిస్తున్న అన్ని వర్గాల పేర్లను తీసుకుని.. మీరంతా నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని అశోక్ గెహ్లాట్ అన్నారు. రాజస్థాన్‌లోని అన్ని కులాలు, మతాలు నాతో లేకుంటే సోనియా గాంధీ నన్ను ఎందుకు ముఖ్యమంత్రిని చేస్తారని అన్నారు.

click me!