కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.... ఖర్గేదే విజయం, థరూర్‌కి అదే మైనస్ : అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Oct 02, 2022, 04:37 PM IST
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.... ఖర్గేదే విజయం, థరూర్‌కి అదే మైనస్ : అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు

సారాంశం

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారని అన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. ఖర్గే.. దళిత వర్గం నుంచి వచ్చిన నాయకుడని, ఆయన పోటీలో నిలబడటాన్ని అందరూ స్వాగతిస్తున్నారని గెహ్లాట్ పేర్కొన్నారు. 

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు పూటకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష రేసులో పలువురి పేర్లు వినిపించగా అంతిమంగా మాత్రం .. శశిథరూర్, మల్లిఖార్జున ఖర్గేలు నిలిచారు. అయితే వీరిద్దరిరలో గాంధీ కుటుంబ ఆశీస్సులు వున్న మల్లిఖార్జున ఖర్గేకే విజయావకాశాలు మెండుగా వున్నాయని చెబుతున్నారు. తాజాగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై ఆ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖర్గే .. పార్టీని బలోపేతం చేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఆయనే విజయం సాధిస్తారని అశోక్ గెహ్లాట్ జోస్యం చెప్పారు. 

మల్లిఖార్జున ఖర్గే.. దళిత వర్గం నుంచి వచ్చిన నాయకుడని, ఆయన పోటీలో నిలబడటాన్ని అందరూ స్వాగతిస్తున్నారని గెహ్లాట్ పేర్కొన్నారు. అటు శశిథరూర్‌పైనా రాజస్ధాన్ సీఎం ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనకు మంచి ఆలోచనలు వున్నాయని, కానీ ఆయన ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి అని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. ఈ కారణం చేత క్షేత్రస్థాయిలో ఖర్గేకు మద్ధతు ఎక్కువగా వుందని ఆయన పేర్కొన్నారు. 

ALso Read:గాంధీల మద్దతు లేదు!.. దళిత నేతగానే కాదు, కాంగ్రెస్ నాయకుడిగా బరిలోకి దిగా.. : మల్లికార్జున్ ఖర్గే

ఇకపోతే.. మల్లికార్జున్ ఖర్గే ఈ రోజు తన ప్రచారాన్ని ప్రారంభించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కీలక విషయాలను ఆయన వెల్లడించారు. ‘ఒక వ్యక్తికి, ఒక పోస్టు అనే నిబంధనను శిరసావహిస్తూ నామినేషన్ వేసిన రోజే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశాను. మహాత్మా గాంధీ జయంతి నాడు నా క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నాను. పార్టీ నేతలు, కార్యకర్తలే నన్ను అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగాలని కోరారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు పోటీ చేయడం లేదని నా సహచరులు చెప్పారు’ అని ఆయన వివరించారు. గాంధీ కుటుంబం సూచనల మేరకే ఖర్గే బరిలోకి దిగారనే ఆరోపణలను కొట్టిపారేశారు. తనకు గాంధీల మద్దతేమీ లేదని వివరించారు. పార్టీ నేతలు, కార్యకర్తల విజ్ఞప్తి మేరకు పోటీ చేస్తున్నారని చెప్పారు.

‘నా బాల్యమంతా ఎన్నో సంఘర్షణలతో నిండి ఉన్నది. భావజాలం, విలువల కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నాను. ప్రతిపక్ష నేతగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా చాలా ఏళ్లు చేశాను. ఇప్పుడు మరోసారి పోరాడాలనుకుంటున్నాను. అవే విలువలు, భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. కాంగ్రెస్ భావజాలరం, బాబా సాహెబ్ రాసిన రాజ్యాంగం విలువలను ముందుకు తీసుకెళ్లడానికే ఎన్నికలో పోటీ చేస్తున్నాను. నాకు పార్టీ ప్రతినిధులు, విభాగాల సభ్యులు అందరి మద్దతు కావాలి’ అని వివరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం