మైసూరు చాముండేశ్వరీ దేవి కొండల్లో మరోసారి కుంగిన భూమి.. నెలరోజుల వ్యవధిలో నాలుగోసారి.. !!

By AN TeluguFirst Published Nov 19, 2021, 4:11 PM IST
Highlights

సుమారు నెలరోజులుగా వర్షాలు కురుస్తున్నందున కొండ ప్రాంతం నుంచి నీరు భారీగా పారుతోంది. దీంతో ఎక్కడ పడితే అక్కడ భూమి కుంగిపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ రెండో వారం నుంచి వర్సాలు విస్తారంగా కురుస్తున్నాయి. 

బెంగళూరు : మైసూరులోని ప్రతిష్టాత్మక ఆలయం కలిగిన Chamundeshwari Devi కొండలమీద గురువారం భూమి మరోసారి కుంగిపోయింది. నెల రోజుల వ్యవధిలో భూమి కుంగిపోవడం ఇది నాలుగోసారి. చాముండి కొండల్లోని నంది మార్గంలో గురువాం తెల్లవారు జామున రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. 

సుమారు నెలరోజులుగా వర్షాలు కురుస్తున్నందున కొండ ప్రాంతం నుంచి నీరు భారీగా పారుతోంది. దీంతో ఎక్కడ పడితే అక్కడ భూమి కుంగిపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ రెండో వారం నుంచి వర్సాలు విస్తారంగా కురుస్తున్నాయి. 

Tamilnadu Rains : విషాదం.. ఇల్లు కూలి నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి...

నవంబర్ ప్రారంభం నుంచి ఏ మాత్రం ఎడతెరిపి లేకుండా rain హోరెత్తిస్తోంది. మరో నాలుగైదు రోజుల పాటు వర్సాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తుండటంతో Mysore ప్రాంత వాసులు బెంబేలెత్తుతున్నారు. ఏకంగా 70 అడుగుల మేరన ప్రాంతం రోడ్డుకు అడ్డంగా ఉండే గోడ దాదాపు కుంగి పోయింది.

ప్రజాపనులు శాఖామంత్రి సీసీ పాటిల్ జియోట్రయల్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చాముండి కొండలను పరిశీలించి నిర్మాణాలు చేపట్టదలచారు. ఓ వైపు నిర్మాణాలు జరపాలని భావిస్తున్నా వరుసగా వర్సాలు కురుస్తుండటంతో సమస్యగా మారింది. రోడ్డు కుంగిపోయిన ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. 
 

click me!