ఉత్తరాఖండ్ లో వ‌ర్ష బీభ‌త్సం.. 31 మంది మృతి, ప‌లు జిల్లాల‌కు ఐఎండీ హెచ్చ‌రిక‌లు

Published : Aug 06, 2023, 05:28 PM IST
ఉత్తరాఖండ్ లో వ‌ర్ష బీభ‌త్సం.. 31 మంది మృతి, ప‌లు జిల్లాల‌కు ఐఎండీ హెచ్చ‌రిక‌లు

సారాంశం

Dehradun: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 5 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్  కొన‌సాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వంటి వివిధ వర్ష సంబంధిత ఘటనల్లో 31 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందని సంబంధిత అధికారులు తెలిపారు.   

Uttarakhand Rains: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 5 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్  కొన‌సాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వంటి వివిధ వర్ష సంబంధిత ఘటనల్లో 31 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందని సంబంధిత అధికారులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఉత్తరాఖండ్ లో కురిసిన వర్షాలకు సంబంధించి ఇప్పటివరకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా సమాచారం ప్రకారం రాజధాని డెహ్రాడూన్ సహా రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో ఉత్తరాఖండ్ లోని ఇతర జిల్లాల్లో కూడా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సునిల్, సింగ్ దార్ ప్రాంతాలు కొండచరియలు విరిగిపడటంతో జోషిమఠ్ లో ప్రాంతంలో ఆందోళన పెరిగింది. 

తెహ్రీలో గోడ కూలి ఇద్ద‌రు మృతి

వర్షాల కార‌ణంగా 1095 ఇళ్లు పాక్షికంగా, 99 ఇళ్లు తీవ్రంగా, 32 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. తెహ్రీలో కురిసిన వర్షానికి గోడ కూలి ఇద్దరు మృతి చెందారు. ఆదివారం తెల్లవారు జామున ఓ గ్రామంలో కురిసిన భారీ వర్షానికి నిద్రిస్తున్న సమయంలో ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, తాతకు గాయాలయ్యాయి. స్థానిక చంబా పోలీస్ స్టేషన్ అధికారి ఎల్ఎస్ బుటోలా మాట్లాడుతూ, ధనౌల్టి తాలూకాలోని మరోడా గ్రామంలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందని చెప్పారు. గోడ కూలిన ఘటనలో ప్రవీణ్ దాస్ పిల్లలు స్నేహ (12), రణ్ వీర్ (10) అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, పాలనా బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల నుంచి పిల్లలను బయటకు తీసి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

నిలిచిన‌ కేదార్ నాథ్ యాత్ర

ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ యాత్ర మార్గంలోని గౌరీకుండ్ సమీపంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 20 మంది గల్లంతవగా, పలు దుకాణాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల మధ్య కొండచరియలు విరిగిపడటంతో మూడు మృతదేహాలను వెలికితీశారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఓ అధికారి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

పాము కాటుతో మ‌ర‌ణించిన తండ్రి పేరుపై రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్‌.. అస‌లు మ్యాట‌ర్ తెలిస్తే ఫ్యూజులు అవుట్
MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్