
Weather department: రుతుపవనాలు భారత ఉపఖండంలోకి మరింత ముందుకు సాగుతున్నందున, రాబోయే ఐదు రోజుల పాటు తమిళనాడు మరియు పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం వెల్లడించింది. వచ్చే 24 గంటల్లో ఈశాన్య భారతదేశం, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలో తీవ్రమైన వర్షపాతం కొనసాగుతుందని అంచనా వేసింది. ఆ తర్వాత తగ్గుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
దక్షిణ భారతదేశంలో వర్షపాతం అంచనాలు..
నీలగిరి, కోయంబత్తూర్, తిరుపూర్, దిండిగల్, తేని, ఈరోడ్, కృష్ణగిరి, ధర్మపురి, సేలం, నమక్కల్, కరూర్, తిరుచిరాపల్లి, పెరంబలూర్, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, తిరుపత్తూరు, వెల్లూరు లో ఒక మోస్తరు నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ విభాగం తెలిపింది. జూన్ 20 నుండి 23 వరకు తమిళనాడు, పుదుచ్చేరి మరియు కారైకల్ ప్రాంతాలలో కొన్ని చోట్ల ఉరుములు మరియు మెరుపులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి మరియు కారైకల్ ప్రాంతంలో ఆదివారం నాడు ఉరుములతో కూడిన పిడుగులు పడే అవకాశముందని వెల్లడించింది. రానున్న 24 గంటలపాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు కనిష్ట ఉష్ణోగ్రత 27-28 డిగ్రీల సెల్సియస్‌గా, గరిష్ట ఉష్ణోగ్రత 36-37 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంది.
మిగిలిన ప్రాంతాలకు వర్షపాతం అంచనాలు
వచ్చే 2-3 రోజులలో ఉత్తర, మధ్య మరియు తూర్పు భారతదేశం అంతటా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో (జమ్మూ, కాశ్మీర్, లడఖ్, గిల్గిట్- బాల్టిస్తాన్ మరియు ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్) ఉరుములు/మెరుపులతో కూడిన విస్తృత వర్షపాతం కొనసాగే అవకాశం ఉంది. పక్కనే ఉన్న మైదాన ప్రాంతాలలో (పంజాబ్, హర్యానా, చండీగఢ్ & ఢిల్లీ) అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 3 రోజులలో ఉత్తర ప్రదేశ్ & రాజస్థాన్‌లలో వివిక్త వర్షపాతం నమోదై.. ఆ తర్వాత తగ్గుతుందని అంచనా వేసింది. జూన్ 20న హర్యానా, చండీగఢ్ & ఢిల్లీ, పశ్చిమ రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు రాజస్థాన్ 19 నుండి 21 వరకు, జూన్ 20 మరియు 21 తేదీలలో పంజాబ్ మీద, జూన్ 21న జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
వచ్చే 5 రోజుల్లో మధ్యప్రదేశ్, విదర్భ మరియు ఛత్తీస్‌గఢ్‌లలో ఉరుములు, మెరుపులతో కూడిన విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 19, 20 మరియు 23 తేదీల్లో పశ్చిమ మధ్యప్రదేశ్ మరియు విదర్భలో వివిక్త భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 19 మరియు 20 తేదీలలో తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా మరియు 19 నుండి 23 జూన్ వరకు ఛత్తీస్‌గఢ్ మీదుగా భారీ వర్షాలు నమోదు అవుతాయని ఐఎండీ అంచనా వేసింది. తెలంగాణలో రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ విభాగం అంచనా వేసింది. ఏపీలోనూ ఇదే పరిస్థితులు ఉంటాయని తెలిపింది.