
Jammu Kashmir: రాష్ట్ర విభజన తర్వాత కూడా జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఈ అప్రమత్తమైన భద్రతా సిబ్బంది టెర్రరిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. క్రమంలోనే జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా, కుల్గాం జిల్లాల్లో ఆదివారం భద్రతా బలగాలతో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. కుప్వారాలో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, కుల్గామ్‌లో మరో ఇద్దరు హతమయ్యారు. మరికొంత మంది ఉగ్రవాదులు దాక్కున్నారని, రెండు ప్రాంతాల్లో ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
వివరాల్లోకెళ్తే.. జమ్మూకాశ్మీర్ లోని కుల్గామ్‌లో ఉగ్రవాదులు మరియు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ప్రాంతంలో మరింత మంది ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా బలగాలకు సమాచారముందని తెలిసింది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్‌లోని దమ్‌హాల్ హంజి పోరా ప్రాంతంలోని గుజ్జర్‌పోరా ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్‌తో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భారత సైన్యం మరియు పోలీసు అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు.
మరోవైపు ఉత్తర కశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. కుప్వారాలో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ముగ్గురు ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. లోలాబ్ ప్రాంతంలో తలదాచుకున్న ఉగ్రవాది షోకెట్ అహ్మద్ షేక్ గురించి సమాచారం అందుకున్న కుప్వారా పోలీసులు ఆర్మీతో కలిసి సంయుక్త యాంటీ-మిలిటెంట్ ఆపరేషన్ ప్రారంభించారు."భద్రతా దళాలు రహస్య స్థావరాలను శోధించినప్పుడు, ఉగ్రవాదులు జాయింట్ సెర్చ్ పార్టీలపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఇందులో ఒక ఉగ్రవాది మరణించాడు" అని కాశ్మీర్ ఐజీపీ వెల్లడించారు.
ఇదిలావుండగా, జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్‌లో రెండు రోజుల ఎన్‌కౌంటర్‌లో జమ్మూ స్కూల్ టీచర్ రజనీ బాలాను హతమార్చిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలోని ద్రాబ్‌గామ్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలలో రెండు AK 47 రైఫిల్స్ మరియు ఒక పిస్టల్ ఉన్నాయి.