అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తాం.. :కేంద్రానికి రైల్వే సంఘాల హెచ్చరిక

By Rajesh Karampoori  |  First Published Feb 29, 2024, 10:54 PM IST

Railway unions:రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని షాక్ ఇచ్చారు.  పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించకపోతే అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మే 1 నుంచి అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తామని పలు రైల్వే సంఘాలు హెచ్చరించాయి.


Railway unions: రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని షాక్ ఇచ్చారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ (OPS) అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒక వేళ  తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే మే 1 నుండి భారతదేశం అంతటా అన్ని రైళ్ల సేవలను నిలిపివేస్తామని  రైల్వే ఉద్యోగులు, కార్మికుల సంఘాలు బెదిరించాయి. ఇటీవల పలు రైల్వే  సంఘాలు జాయింట్ ఫోరమ్ ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ పాత పెన్షన్ స్కీమ్ (JFROPS)అనే పేరిట  ఒక్కటయ్యాయి.  తాజా JFROPS కోర్ కమిటీ సమావేశమైంది. 

పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించాలన్న తమ డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని.. అందువల్ల ప్రత్యక్ష కార్యాచరణకు దిగడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని అన్నారు.  మే 1, 2024 (అంతర్జాతీయ కార్మిక దినోత్సవం) నుండి OPS కోసం నిరవధిక సమ్మెను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు JFROPS కన్వీనర్, ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా తెలిపారు. ఈ తరుణంలో సోషల్ మీడియా వేదికగా నిరవధిక సమ్మెకు సంబంధించిన నోటీసును పంచుకున్నారు.

Latest Videos

మార్చి 19న కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖను కలిసి సమ్మె అంశంపై అధికారికంగా నోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్లు కన్వీనర్‌ వివరించారు. మే 1 నుంచి దేశవ్యాప్తంగా సమ్మె, అన్ని రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించడంపై నోటీసు తమకు తెలియజేస్తుందని  తెలిపారు. ఇతర ప్రభుత్వ సంఘాలు సైతం తమ పోరాటంలో భాగం కానున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఓపీఎస్‌ కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొత్త పెన్షన్‌ పథకం తమ ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని మిశ్రా అన్నారు .

click me!