రైల్లో.. లేడీస్ కంపార్ట్ మెంట్లో ఎక్కే పురుషులూ.. తస్మాత్ జాగ్రత్త.. ఒక్క నెలలో 7వేలమంది అరెస్ట్...

Published : Jun 03, 2022, 11:03 AM IST
రైల్లో.. లేడీస్ కంపార్ట్ మెంట్లో ఎక్కే పురుషులూ.. తస్మాత్ జాగ్రత్త.. ఒక్క నెలలో 7వేలమంది అరెస్ట్...

సారాంశం

మహిళల భోగీల్లో ప్రయాణించే పురుష ప్రయాణికులకు రైల్వే శాఖ హెచ్చరిక జారీ చేస్తోంది. అలా ప్రయాణించే వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా మహిళా పోలీస్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. 

న్యూఢిల్లీ : రైల్వే Ladies coachలలో ఎక్కే పురుషులకి రైల్వే శాఖ ఝల క్ ఇవ్వనుంది..  అబ్బాయిలు మీరు రైల్వే లేడీస్ కోచ్ లలో ఎక్కుతున్నారా? అయితే జర జాగ్రత్త అంటున్నారు Railway Police Force మహిళా సిబ్బంది. మహిళల భోగిల్లో అక్రమంగా ప్రయాణిస్తున్న ఏడు వేల మంది యువకులను తాజాగా రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. శిక్షణ పొందిన మహిళ అధికారులు, సిబ్బందితో కూడిన 283 బృందాలు 223 రైల్వేస్టేషన్లను మోహరించి తనిఖీలు జరుపుతున్నారు. 1,125 మంది మహిళా ఆర్పిఎఫ్ సిబ్బందిని భారతీయ రైల్వేలో  నియమించారు. 

లేడీస్ కోచ్ లలో అక్రమంగా ప్రయాణించినందుకు ఒక నెల వ్యవధిలో ఏడు వేల మంది పురుషులను మహిళా పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ మహిళా సురక్ష కింద నుంచి మేనుంచి మే 31 వ తేదీల మధ్య ఈ డ్రైవ్ ను ఆర్ పిఎఫ్ ప్రకటించింది.  రైల్వే నిబంధనల ప్రకారం పురుషులు మహిళల కోసం ప్రత్యేక కోచ్ లలో ప్రయాణించకూడదు. ఇది శిక్షార్హమైన నేరం. రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు మెరుగైన భద్రత కల్పించే లక్ష్యంతో  దేశవ్యాప్తంగా ‘మేరీ సహేలి’ కార్యక్రమం కూడా అమలులో ఉంది. ఈ కాలంలో మహిళా ఆర్పీఎఫ్ సిబ్బంది రేలు ఎస్కార్ట్ విధులు చేపట్టారు. ఈ నెల రోజుల ఆపరేషన్లో ఆర్ పిఎఫ్ సిబ్బంది జారిపడిన పది మంది మహిళల ప్రాణాలను కాపాడారు. 
 

PREV
click me!

Recommended Stories

Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM