కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు, టెంపో ఢీకొని ఎనిమిది మంది హైద్రాబాద్ వాసుల మృతి

Published : Jun 03, 2022, 10:46 AM ISTUpdated : Jun 03, 2022, 12:03 PM IST
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు, టెంపో ఢీకొని ఎనిమిది మంది  హైద్రాబాద్ వాసుల మృతి

సారాంశం

కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగి జిల్లా కమలపురా పట్టణ శివారులో శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టెంపో ట్రాక్స్ ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. 

బెంగుళూరు:Karnataka రాష్ట్రంలోని kalaburagi, వద్ద శుక్రవారం నాడు జరిగిన Road Accidentలో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. కలబురిగి జిల్లా కమలాపురా పట్టణ శివార్లలో ఈ ప్రమాదం జరిగింది.  ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టెంపో ట్రాక్స్ ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి.  బస్సు గోవా నుండి హైద్రాబాద్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కలబురగిలోని పలు ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంలో 12 మందిని రక్షించారు. ఈ ఘటనలో చనిపోయిన వారు హైద్రాబాద్ కు చెందినవారుగా అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్ సహా 35 మంది ఉన్నారుహైద్రాబాద్ కు చెందిన ఐటీ ఉద్యోగి అర్జున్ తన కూతురు బర్త్ డే వేడుకలకు గాను బంధువులు, స్నేహితులతో కలిసి గోవా వెళ్లినట్టుగా సమాచారం. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు.ఈ ఘటనలో మరణించిన వారిని అర్జున్, సరళ, శివకుమార్, రవళి, దీక్షిత్,అర్జున్, అనితతో మరొకరు మరణించారు. బస్సులోని 35 మందిలో ఒకే కుటుంానిిికి చెందిన వారు 25 మంది ఉన్నారు.

గత నెల 31వ తేదీన  ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఫతేగంజ్ ప్రాంతంలో అంబులెన్స్..ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

ఫిల్‌బిత్ కు  చెందిన ఒక కుటుంబంలోని ఆరుగురు సభ్యులు అంబులెన్స్‌లో ఢిల్లీ నుంచి తిరిగివస్తున్నారు. వారిలో ఒకరికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చూపించి తిరిగివస్తుండగా.. ఢిల్లీ-లక్నో హై వేపై ప్రమాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ మొదట డివైడర్‌ను ఢీకొట్టి ఆ తర్వాత ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు వాహనంలోని మరో ఆరుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు.

also read:డ్రైవింగ్ చేస్తుండగానే బైక్‌లో మంటలు.. తృటిలో తప్పించుకున్న రైడర్
ఉత్తర్ ప్రదేశ్  రాష్ట్రంలోని  అయోధ్య లో మే 29న  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. బహేరీ,చ్ -లఖీంపూర్ జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం టూరిస్ట్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

కర్ణాటక నుండి 16 మందితో కూడిన బస్సు అయోధ్యకు వెళ్లున్న సమయంలో మోతీపూర్ ప్రాంతంలో నానిహా మార్కెట్ వద్ద ఎదురుగా ఉన్న లేన్ లోకి ప్రవేశించడంతో ఈ ఘటన చోటు చేసుకుందని అదనపు పోలీస్ సూపరింటెండ్ ఆశోక్ కుమార్ చెప్పారు.

బస్సు డ్రైవర్ తో సహా ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మరణించారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన తర్వాత ట్రక్కు డ్రైవర్ పారిపోయాడు. ఈ ఘటనపై విచారన చేస్తున్నామని ఎఎస్పీ తెలిపారు.ఈ ప్రమాదంలో మరణించిన వారికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సీఎం ఆదేశించారు.

 తెలంగాణ జిల్లాలోని సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్  మండలం అలీ రాజ్ పేట్ బ్రిడ్జి వద్ద మే 27న ప్రమాదం జరిగింది. జగదేవ్ పూర్ మండలానికి చెందిన ఓ కుటుంబం ఆటోలో  మెదక్ వెళ్తోంది.  ఆటోకి ఎదురుగా వస్తున్న లారీ అలీరాజ్‌పేట వద్ద ఢీకొంది.  ఆటోలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.  తీవ్రగాయాలైన నలుగురిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మార్గమధ్యలో మరణించారు.  మిగిలిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో జగదేవ్‌పూర్ లో విషాదఛాయలు అలముకున్నాయి. 

మే 26న  ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలో ఇలాంటి ప్రమాదమే జరిగింది.కారు కల్వర్టును ఢీకొనడంతో.. కారులోని నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. చనిపోయినవారిని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. 

కృష్ణా జిల్లాలోనూ ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. పెళ్లికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన జిల్లాలోని మోపిదేవి మండలంలో చోటుచేసుకుంది. చల్లపల్లి మండలంలోని చింతమడ నుంచి పెళ్లి బృందం మోపిదేవి మండలం పెడప్రోలు గ్రామంలో జరుగుతున్న పెళ్లి వేడుకలకు  బయలుదేరింది. ఈ  వాహనం మోపిదేవి మండలం కాశానగర్ వద్ద వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. 

ఈ ప్రమాదంలో నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం మీద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని  సహాయక చర్యలు చేపట్టారు.  గాయపడిన వారిని అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.  గాయపడిన వారిని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరామర్శించారు. 

మే 16న  ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా కురబలకోట మంలం మదనపల్లి-రాయచోటి ప్రధాన రహదారిమీద మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు పెద్దమండ్యం మండలం కలిచర్లకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఒకే కటుంబానికి చెందిన నలుగురు మదరనల్లి నుంచి స్వగ్రామం కలిచెర్లకి వెల్తుండగా ఈ ఘటన జరిగింది
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Surya Tilak on Ram Lala in Ayodhya: అయోధ్యలో అద్భుతంబాలరాముని నుదుటిన సూర్య తిలకం | Asianet Telugu
శ్రీరామనవమి రోజు అయోధ్యలో వానరం ఏం చేసిందో చూడండి: Ayodhya Rama Navami | Asianet News Telugu