కేంద్ర బడ్జెట్ 2020: పర్యాటక ప్రాంతాలకు తేజస్ రైళ్లు, ముంబై-అహ్మదాబాద్‌కు హై స్పీడ్ ట్రైన్

By narsimha lodeFirst Published Feb 1, 2020, 12:57 PM IST
Highlights

పీపీపీ పద్దతిలో  150 రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలాా సీతారామన్ ప్రకటించారు. 

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని పర్యాటక రంగాలను కలుపుతూ తేజస్ రైళ్లను  అందుబాటులోకి తీసుకువస్తామని  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 

శనివారం నాడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రైల్వేకు సంబంధించి కీలక అంశాలను మంత్రి సీతారామన్  ప్రస్తావించారు.  

త్వరలో చెన్నై- బెంగుళూరు  ఎక్స్‌ప్రెస్ వే ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2023 నాటికి ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్ వే  పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. 

 ముంబై-  అహ్మదాబాద్ హై స్పీడ్ ట్రైన్ ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. 9 వేల కి.మీ. ఎకనమిక్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు.

దేశంలోని పోర్టులను కలుపుతూ తీరప్రాంత రోడ్లను అభివృద్ది చేస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. రైల్వే ట్రాక్స్ వెంట సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి.  

2024 నాటికి దేశంలో కొత్తగా 100 కొత్త ఎయిర్‌పోర్టులను నిర్మించనున్నట్టుగా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రవాణా మౌలిక రంగానికి రూ. 1.7 లక్షల కోట్లను కేటాయించినట్టుగా మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.

 ప్రభుత్వ, ప్రైవేట్  భాగస్వామ్యంలో 150 రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి చెప్పారు. దేశంలోని అన్ని పర్యాటక ప్రదేశాలకు తేజస్ తరహా ప్రైవేట్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

 బెంగళూరు నగరానికి రూ.18,600 కోట్లతో మెట్రో తరహా సబర్బన్‌ రైల్వే పథకాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ పథకానికి  20 శాతం కేంద్రం, అదనపు నిధుల ద్వారా 60 శాతం సమకూరుస్తుందని చెప్పారు.  11 వేల కిలోమీటర్ల మేర రైల్వే మార్గాలు విద్యుద్దీకరణ చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 
 

click me!