కేంద్ర బడ్జెట్ 2020: కొత్తగా 60 లక్షల మంది కొత్త ట్యాక్స్ పేయర్స్

By narsimha lodeFirst Published Feb 1, 2020, 11:25 AM IST
Highlights

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా  సీతారామన్ తన ప్రసంగంలో  ఐటీ రిటర్న్స్ లో సమూల మార్పులు చేసినట్టుగా చెప్పారు. 


న్యూఢిల్లీ: ఆదాయ పన్ను దాఖలులో సమూల మార్పులు తీసుకొచ్చినట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ విధానం కారణంగా కొత్తగా ఆదాయ పన్ను రిటర్న్ దాఖల్లో కొత్తగా చేరుతున్నవారి సంఖ్య పెరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. 

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌  శనివారం నాడు రెండోసారి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా ఆమె తన ప్రసంగంలో ఐటీ పన్ను చెల్లింపు దారుల గురించి ప్రస్తావించారు. 

Also read:బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం

కొత్తగా  60 లక్షల మంది  ఐటీ రిటర్న్స్  దాఖలు చేసినట్టుగా మంత్రి వెల్లడించారు. పన్నుల చెల్లింపు ద్వారా దేశ ఆర్ధిక ప్రగతికి దోహదం చేసినట్టుగా అవుతుందని ఆమె చెప్పారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ ద్వారా పథకాలు నేరుగా  ప్రజల బ్యాంకు ఖాతాల్లో చేరుతున్నాయని మంత్రి గుర్తు చేశారు. 

మరో వైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2020ని పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి కూడా ఆమెనే బడ్జెట్ ప్రతిపాదించారు.


 

click me!