‘‘త‌మిళ అమ్మాయినే రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటారు ’’ యాత్రలో స‌ర‌దా క్ష‌ణాల‌ను ట్వీట్ చేసిన జైరాం రమేష్..

By team teluguFirst Published Sep 11, 2022, 1:11 PM IST
Highlights

భారత్ జోడో యాత్రలో శనివారం ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. తమిళనాడు లో ఉపాధి హామీ పథకం మహిళా కార్మికులు రాహుల్ గాంధీ దగ్గరకు చేరుకొని ముచ్చటించారు. వారి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడే ఈ పరిణామం జరిగింది. 

కాంగ్రెస్ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర కొన‌సాగుతోంది. క‌న్యాకుమారిలో మొద‌లైన యాత్ర మూడో రోజు సంద‌ర్భంగా ఓ స‌ర‌దా స‌న్నివేశం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోల‌ను, అక్క‌డ జ‌రిగిన సంభాష‌ణ‌ల‌ను కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు జైరాం ర‌మేష్ త‌న ట్వీట్ ద్వారా తెలియ‌జేశారు. తమిళనాడులో స్థానిక మహిళా MGNREGA కార్యకర్తలు రాహుల్ గాంధీ వ‌ద్ద‌కు చేరుకున్న‌ప్పుడు ఇది జ‌రిగింది. 

కృష్ణంరాజు మరణం కలచివేసింది: కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ సానుభూతి

‘‘ భార‌త్ జోడో యాత్ర‌లో మూడో రోజు ఒక సంతోష‌క‌ర‌మైన క్ష‌ణం.. ఈ మధ్యాహ్నం మార్తాండమ్‌లో ఎంజీఎన్ఆర్ఈజీఏ కార్యకర్తలతో  రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. అయితే ఈ సమయంలో ఓ మహిళ ముందుకు వచ్చి.. రాహుల్ గాంధీ తమిళనాడును ప్రేమిస్తున్నారని మాకు తెలుసు. ఆయ‌న తమిళ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారని కూడా మాకు తెలుసు అని అన్నారు. దీంతో రాహుల్ గాంధీ స‌ర‌దాగా న‌వ్వారు. ఈ విష‌యం ఫొటోల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇది చాలా వినోద భ‌రితమైన ఘ‌ట్టం ’’ అని జైరాం రమేష్ ట్వీట్ చేశారు.

A hilarious moment from day 3 of

During ’s interaction with women MGNREGA workers in Marthandam this afternoon, one lady said they know RG loved Tamil Nadu & they’re ready to get him married to a Tamil girl! RG looks most amused & the photo shows it! pic.twitter.com/0buo0gv7KH

— Jairam Ramesh (@Jairam_Ramesh)

రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర శనివారం సాయంత్రం కేరళకు చేరుకుంది. తమిళనాడు సరిహద్దులో వేలాది మంది కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ యాత్ర ఆదివారం ఉద‌యం కేరళలోని పరసాలకు చేరుకుంది. ప్రతిచోటా ప్రజలు రాహుల్ గాంధీతో ప్ర‌జ‌లు మ‌మేకం అవుతున్నారు. రాహుల్ గాంధీ కూడా అంద‌రితో క‌లిసిపోతున్నారు. కేరళ రాష్ట్రంలోని ఏడు జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రలో ఇతర జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు. 

ఎన్సీపీకి ఎదురుదెబ్బ.. శివ‌సేన షిండే వ‌ర్గంలో చేరనున్న అశోక్ గావ్డే

ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించింది. ఇది ఐదు నెలల పాటు కొనసాగుతుంది యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3570 కిలో మీటర్ల పాటు సాగుతుంది. ఈ యాత్ర తమిళనాడులో బుధవారం ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ‘‘ మన దేశ భవిష్యత్తు ఎలా ఉండాలనే దాని కోసం భారత్ ఇప్పుడు విజన్ దివాళాకోరుతనాన్ని ఎదుర్కొంటోంది. మేము భారీ గుత్తాధిపత్యాల ఆలోచనకు వ్యతిరేకంగా ఉన్నాము. మేము అన్యాయానికి వ్యతిరేకంగా ఉన్నాము. ఆ పార్టీ రైతులకు లేదా ఎమ్ఎస్ఎమ్ఈలకు వ్యతిరేకంగా ఉంటుంది. ’’ అని అన్నారు. 

Congress' led by party MP Rahul Gandhi enters its Kerala leg; visuals from Parassala, Thiruvananthapuram. pic.twitter.com/r1sCyaYByP

— ANI (@ANI)

‘‘ బీజేపీ-ఆర్ఎస్ఎస్ లు దేశాన్ని మతపరంగా విభజించడానికి ప్రయత్నిస్తున్నాయి. ద్వేషం వల్ల దేశాన్ని కోల్పోబోము. సమస్య ఏమిటంటే వారు భారతీయ ప్రజలను అర్థం చేసుకోలేరు. భారతీయ ప్రజలు భయపడరు. వారు ఎన్ని గంటల విచారణ చేసినా పర్వాలేదు. ఏ ఒక్క ప్రతిపక్ష నేత కూడా బీజేపీని చూసి భయపడరు ’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కాగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై కూడా వివాదాలు కూడా వస్తున్నాయి. ఆయన ధరించిన విదేశీ టీ-షర్ట్, దాని ధర, అలాగే పూజారి విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. 

click me!