వాజ్‌పేయి సహా పలువురు మాజీ ప్రధానుల స్మారకాల వద్ద రాహుల్ గాంధీ నివాళులు..

Published : Dec 26, 2022, 09:54 AM IST
వాజ్‌పేయి సహా పలువురు మాజీ ప్రధానుల స్మారకాల వద్ద రాహుల్ గాంధీ నివాళులు..

సారాంశం

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఉదయం ఢిల్లీలో మహాత్మా గాంధీ‌, పలువురు మాజీ ప్రధానుల స్మారక చిహ్నాలను సందర్శించి వారికి నివాళులర్పించారు. 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఉదయం ఢిల్లీలో పలువురు ప్రముఖుల స్మారకాల వద్ద నివాళులర్పించారు. మహాత్మా గాంధీ‌, పలువురు మాజీ ప్రధానుల స్మారక చిహ్నాలను రాహుల్ సందర్శించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర డిసెంబర్ 24వ తేదీన ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం యాత్రకు 9 రోజులు విరామం ఇచ్చారు. తిరిగి జనవరి 3న రాహుల్ భారత్ జోడో యాత్ర తిరిగి  ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న రాహుల్ గాంధీ.. పలువరు ప్రముఖుల స్మారకాల వద్ద నివాళులర్పించారు. 

మహాత్మాగాంధీ స్మారకం రాజ్‌ఘాట్, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి స్మారకం విజయ్ ఘాట్‌లను సందర్శించిన రాహుల్ గాంధీ వారికి నివాళుర్పించారు.  అలాగే మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ స్మారకం వీర్‌భూమి, ఇందిరా గాంధీ స్మారకం శక్తిస్థల్, జవహర్‌లాల్ నెహ్రు స్మారకం శాంతి వనాలను కూడా సందర్శించిన రాహుల్ గాంధీ.. వారికి ఘనంగా నివాళులర్పించారు. 

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకం సదైవ్ అటల్ వద్ద కూడా రాహుల్ గాంధీ నివాళులర్పించారు. అయితే రాహుల్ గాంధీ శనివారం (డిసెంబర్ 24) తన భారత్ జోడో యాత్రకు విరామం ఇచ్చిన తర్వాత మాజీ ప్రధానులకు నివాళులర్పించాలని అనుకున్నారు. అయితే దానిని తర్వాత సోమవారం ఉదయానికి వాయిదా వేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం