అన్నాచెల్లెళ్లే ప్రేమించుకున్నారు... కానీ ఆ తర్వాత....!

Published : Dec 26, 2022, 09:50 AM IST
 అన్నాచెల్లెళ్లే ప్రేమించుకున్నారు... కానీ ఆ తర్వాత....!

సారాంశం

వారి వరస కరెక్ట్ కాదు కాబట్టి.... కుటుంబసభ్యులు వద్దని వారించారు.  తమ బంధానికి అందరూ అడ్డుగా నిలుస్తున్నారనే కారణంతో.... కలిసి జీవించలేక... ఇద్దరూ కలిసి చనిపోయారు. 


వారిద్దరూ వరసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. ఒకే తల్లికి పుట్టకపోయినా.... వరసకు మాత్రం అన్నా, చెల్లెళ్లు అవుతారు. అయితే... వారు వరస మర్చిపోయి.... ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లిచేసుకొని కలిసి జీవించాలని అనుకున్నారు. కానీ.... వారి వరస కరెక్ట్ కాదు కాబట్టి.... కుటుంబసభ్యులు వద్దని వారించారు.  తమ బంధానికి అందరూ అడ్డుగా నిలుస్తున్నారనే కారణంతో.... కలిసి జీవించలేక... ఇద్దరూ కలిసి చనిపోయారు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకోగా...... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ సమీపంలోని ముండియారంసర్ గ్రామానికి చెందిన ఓమి బంజారా(20), సంజు బంజారా(14)లు వరసకు అన్నా చెల్లుళ్లు అవుతారు. కాగా... వారు అనుకోకుండా ఒక రోజు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామ శివారులోని ఓ చెట్టుకు వారు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే స్థానికులు గమనించి... పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

వారిద్దరూ ప్రేమించుకున్నారని వరస కుదరకపోవడం వల్ల పెద్దలు పెళ్లికి ఒప్పుకోరనే భయంతో చనిపోయి ఉంటారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు