కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత మనసు దోచుకున్న చిన్నారి.. థ్యాంకు చెప్పిన రాహుల్ .. ఇంతకీ ఏం జరిగిందంటే..?

By Rajesh KarampooriFirst Published Nov 28, 2022, 11:19 AM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ  ప్రతి రోజు భారత్ జోడో యాత్రలో జరిగిన ఆసక్తికర ఘటనలను, ఆ పార్టీ  నాయకులు ప్రయాణ సమయంలో ప్రజలతో సంభాషించిన  వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తుంది. ఈ క్రమంలో ఆదివారం నాడు రాహుల్ గాంధీకి ఓ పిల్లవాడు తన పిగ్గీ బ్యాంకును అందజేసి.. అధినేత మనస్సును దోచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. 

కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కాశ్మీర్ వైపు సాగుతోంది. సెప్టెంబర్‌లో దక్షిణభారతదేశం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో పలువురు నాయకులు పాల్గొని ఈ యాత్రకు మద్దతు తెలిపారు. ఈ సమయంలో పార్టీ మాజీ అధినేత, ఇతర నేతలు ప్రజలతో సంభాషించే వీడియోలు, ఫోటోలు ప్రతి రోజు వారి పార్టీ ట్వీటర్ హ్యాండిల్ లో  షేర్ చేయబడుతున్నాయి. ఆదివారం జరిగిన యాత్రలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. 

రాహుల్ గాంధీ మాస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కోసం ఓ పిల్లవాడు తన పిగ్గీ బ్యాంకులో దాచుకున్న డబ్బులను రాహుల్ గాంధీకి అందజేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పంచుకున్నారు. పార్టీ మాజీ అధినేత  రాహుల్ గాంధీ ఆ పిల్లవాడికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చూడవచ్చు. పిగ్గీ బ్యాంకును తీసుకున్న రాహుల్ గాంధీ పిల్లవాడిని కౌగిలించుకుని కృతజ్ఞతలు తెలిపారు. 

Latest Videos

బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్ ..

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చేరుకుంది. ఈ నగరం బిజెపికి కంచుకోట. 1984 నుండి లోక్‌సభ ఎన్నికలలో.. 1995 నుండి మేయర్ ఎన్నికలలో బీజేపీకి తిరుగులేదు. అయితే.. ఈ యాత్రలో రాహుల్ గాంధీ మరో సారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. “చైనా సైన్యం భారతదేశానికి చేయలేనిది.. బీజేపీ నోట్ల రద్దు,  లోపభూయిష్ట జీఎస్టీ అమలు చేసిందని విమర్శించారు. బీజేపీ విధానాల వల్ల  దేశంలో కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. చిన్న,మధ్యస్థ వ్యాపారులు చాలా నష్టపోయారు. రైతుల నగదు ప్రవాహానికి ఆటంకం కలిగించారని తీవ్రంగా ఆరోపించారు. బీజేపీ విధానాల వల్ల  దేశంలో ఉద్యోగాలు అంతరించిపోయాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ముతపడ్డాయి. కోట్లాది మంది  ఉద్యోగాలు కోల్పోయారు. ఇంజనీరింగ్,ఇతర ప్రొఫెషనల్ డిగ్రీ చేసి..  క్యాబ్‌లను నడపడం లేదా డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. పేదల జేబుల నుండి డబ్బులను లాక్కొని ధనికులు చేతికి ఇస్తున్నారని ఆరోపించారు. అది రాష్ట్రాలలో అధికారం చేజిక్కించుకోవాలని, అక్కడి మంత్రులను కొనేస్తున్నారని విరుచుకుపడ్డారు. మీడియా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సెలబ్రిటీలపై రిపోర్టు చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. జర్నలిస్టులు ఒత్తిడితో ఇలా చేస్తున్నారని, వారిపై తనకు ఎలాంటి ద్వేషం లేదని అన్నారు.

"నిరుద్యోగం, రైతుల కష్టాలు లేదా భారత్ జోడో యాత్ర విజయం వంటి ప్రజా సమస్యలపై  కథనాలు రాసే బదులు.. మీడియా సిబ్బంది ఐశ్వర్య రాయ్ ఎలాంటి దుస్తులు ధరించారు, షారుఖ్ ఖాన్ ఏమి మాట్లాడుతున్నారు. విరాట్ కోహ్లి బద్దలు కొట్టిన రికార్డులేంటీ అనే కథనాలు రాస్తున్నారని అని అన్నారు. రాజకీయ ఒత్తిడి వల్లనే ఇలాంటి వార్తలు రాస్తున్నారని మరోసారి పేర్కొన్నారు. టీవీలు ఆన్ చేస్తే.. నరేంద్ర మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ఐశ్వర్యరాయ్, అజయ్ దేవగన్‌లు మాత్రమే కనిపిస్తున్నారు. రైతుల ఆందోళనలు, ప్రజసమస్యలను ఎప్పటికీ చూడలేరని  ఆయన అన్నారు.

click me!