దారుణం.. భర్త మీది కోపం.. ఏడాదిన్నర కూతురిని గొంతు నులిమి చంపిన కన్నతల్లి...

By SumaBala BukkaFirst Published Nov 28, 2022, 10:45 AM IST
Highlights

భర్త మీది కోపంతో ఏడాదిన్నర చిన్నారి గొంతు నులిమి అత్యంత కిరాతకంగా హతమార్చిందో తల్లి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో చోటు చేసుకుంది. 

మీరట్‌ : భర్తపై కోపంతో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. నవమాసాలు మోసి, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ అనే మమకారాన్నిమరిచిపోయింది. ఏడాదిన్నర బాలికను అతి కర్కశంగా గొంతు నులిమి హత్య చేసింది. ఈ మేరకు పోలీసులు వివరాలు తెలిపారు. ఈ ఘటన బిజ్నోర్ జిల్లాలోని ఔరంగపూర్ భిక్కు గ్రామంలో చోటుచేసుకుంది. బిజ్నోర్ పోలీసు సూపరింటెండెంట్ దినేష్ సింగ్ మాట్లాడుతూ, " శనివారం తన కుమార్తె అనుమానాస్పద స్థితిలో చనిపోయిందని చిన్నారి తండ్రి అంకిత్ సింగ్ ఫిర్యాదు చేశాడు. దీంతో మేం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపాం, పోస్టుమార్టం నివేదికలో చిన్నారి ఊపిరాడక మరణించిందని తేలింది. 

"దీంతో అనుమానంతో తల్లిని ప్రశ్నించాం. మా విచారణలో చిన్నారి తల్లి నేరం అంగీకరించింది. దీంతో తల్లి శివాని రాణిని అదుపులోకి తీసుకున్నాం. భర్తతో తీవ్ర వాగ్వాదం జరగడంతో పట్టరాని కోపంతో చిన్నారి గొంతు కోసి చంపినట్లు చెప్పింది. ఆమెను అరెస్ట్ చేసి ఆదివారం జైలుకు పంపాం” అని ఎస్పీ తెలిపారు. అంకిత్, శివాని మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు పుట్టిన తర్వాత తరచూ గొడవ పడుతుండేవారని ఇరుగుపొరుగు వారు తెలిపారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితురాలు తల్లిపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రోజురోజుకూ పెరుగుతున్న పదిహేనేళ్ల బాలిక పొట్ట.. అనుమానంతో తల్లిదండ్రులు నిలదీయగా....

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో గతంలోనూ చోటు చేసుకుంది. భర్తతో గొడవ పడిన ఓ మహిళ దారుణమైన చర్యకు ఒడిగట్టింది. భర్తతో గొడవ పడిన ఆ మహిళ తన ఐదుగురు పిల్లలను గంగానదిలోకి విసిరేసింది. ఈ మేరకు పోలీసులు తెలిపారు. ఈ ఘటన 2020 ఏప్రిల్ 13న ఉత్తరప్రదేశ్లో జరిగింది.

మంజు యాదవ్, మృదుల్ యాదవ్ భార్యభర్తలు. ఈ ఘటనకు ఏడాది ముందునుంచి కుటుంబ విషయాలపై గొడవపడుతూ పస్తున్నారు. ఈ కారణంతోనే పిల్లలను నదిలో పడేసి చంపాలని మంజు యాదవ్ ఆలోచించిందని పోలీసులు చెప్పారు. ఘటన జరిగిన రోజు రాత్రి భర్తతో గొడవ పడిన మంజు తన ఐదుగురు పిల్లలను తీసుకుని నది దగ్గరికి వెళ్లి.. వారిని నదిలో పడేసింది. పిల్లలను జహీంగరాబాద్ ఘాట్ వద్ద  నదిలో పడేసింది. ఆ ప్రాంతంలో నీరు చాలా లోతుగా ఉంటుంది. 

పిల్లలు నదిలో పడుతున్న సమయంలో కొంత మంది మత్స్యకారులు పిల్లల అరుపులు విన్నారు. అయితే అప్పటికే చాలా చీకటి కావడంతో.. చీకట్లో అరుపులు వినిపించడంతో మత్స్యకారులు భయపడి పారిపోయారని అంటున్నారు. పిల్లలను నదిలో పడేసిన తర్వాత ఆ మహిళ ఒడ్డునే కూర్చుండిపోయింది. తెల్లారి గ్రామస్తులకు స్వయంగా విషయం చెప్పింది.

click me!