ఖర్గే ‘రిమోట్ కంట్రోల్’ కాకపోతే కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీని బహిష్కరించాలి - బీజేపీ

By team teluguFirst Published Dec 17, 2022, 2:09 PM IST
Highlights

రాహుల్ గాంధీని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. కొత్త అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గాంధీ కుటుంబానికి ‘రిమోట్ కంట్రోల్’గా ఉండకపోతే ఆయనను పార్టీ నుంచి తొలగించాలని అన్నారు. 

అరుణాచల్ ప్రదేశ్‌లో భారత ఆర్మీ సిబ్బందిని చైనా సైనికులు కొడుతున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శనివారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ‘రిమోట్ కంట్రోల్’ కాకపోతే, ప్రతిపక్ష పార్టీ దేశానికి మద్దతుగా నిలబడితే, భారత్ ను కించపరిచేలా, విచ్చిన్నం చేసేలా మాట్లాడిన రాహుల్ గాంధీని బహిష్కరించాలని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు.

రాహుల్ గాంధీ ప్రకటనపై బీజేపీ నేతల ఫైర్.. అసలేం జరిగింది...?

రాహుల్ గాంధీని ఖర్గే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీగా కాకుండా, భారత వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ జైపూర్ నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో భాటియా ఈ విధంగా మాట్లాడారు. 

ఆ మీడియా సమావేశంలో.. చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని, కానీ ప్రభుత్వం ముప్పును విస్మరించడానికి ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వం నిద్రలో ఉందని అన్నారు. ప్రభుత్వం నిజాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదని తెలిపారు. భారత ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం నడవట్లేదని, కేవలం ఈవెంట్లను ఆధారం చేసుకుని నడుస్తున్నదని విమర్శించారు.

భార్యతో గొడవపడి.. రెండేళ్ల కొడుకును బాల్కనీలోనుంచి విసిరేసిన తండ్రి..

‘చైనా మన భూభాగాలను దురాక్రమించింది. వారు మన జవాన్లపై దాడి చేస్తున్నారు. చైనా నుంచి ఉన్న ముప్పు సుస్పష్టం. కానీ, ప్రభుత్వం దాన్ని దాస్తున్నది. పట్టించుకోవట్లేదు. లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లలో చైనా దాడి చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నది. కానీ, మన ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర పోతున్నది’ అని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. 

జామియా మసీదు ప్రాంగణంలో పురుషులు, మహిళలు కలిసి కూర్చోవడం నిషేధం - నోటిఫికేషన్ జారీ చేసిన యాజమాన్యం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఇతర బీజేపీ నాయకుడు కూడా మండిపడ్డారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఓ ట్వీట్ చేస్తూ.. ‘రాహుల్ గాంధీ చైనాపై తన ప్రేమలో అన్ని పరిమితులను అధిగమించాడు. అందుకు విరుద్ధంగా వీడియో సాక్ష్యం ఉంది. కానీ భారత సైనికులను చైనీయులు కొట్టారని రాహుల్ అంటున్నారు. ఎవరైనా భారతదేశాన్ని, భారత సైన్యాన్ని ఎలా ద్వేషిస్తారు?’’ అని పేర్కొన్నారు.

click me!