కాంగ్రెస్‌ను వీడాలనుకునేవాళ్లు.. వెళ్లిపోవచ్చు: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 15, 2020, 6:45 PM IST
Highlights

మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే కాంగ్రెస్‌ను వీడగా.. ఇప్పుడు రాజస్థాన్‌లో సచిన్ పైలట్ కూడా ఇదే దారిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే కాంగ్రెస్‌ను వీడగా.. ఇప్పుడు రాజస్థాన్‌లో సచిన్ పైలట్ కూడా ఇదే దారిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్ విభాగం ఎన్ఎస్‌యూఐ నాయకులతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని వీడాలనుకునే వాళ్లు వెళ్లొచ్చని వ్యాఖ్యానించారు.

Also Read:రాజస్థాన్ లోనూ అదే తప్పు: వైఎస్ జగన్ బాటలో సచిన్ పైలట్...?

అలాంటి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం వస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. కాగా రాజస్థాన్‌లో సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మద్ధతుదారులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు.

రాజస్ధాన్ ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు అభిమన్యు పూనియా నేతృత్వంలో దాదాపు 500 మంది ఎన్ఎస్‌యూఐ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. పైలట్ సొంత నియోజకవర్గమైన తోంక్‌లోనూ స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి, తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు.

గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన శరద్ పవార్, మమతా బెనర్జీ, వైఎస్ జగన్‌లాగానే సచిన్ పైలట్ సైతం కొత్త పార్టీ పెట్టాలని ఆయన మద్ధతుదారులు కోరుతున్నారు. 

click me!