అబ్బాయిల కంటే అమ్మాయిలదే పైచేయి: సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల విడుదల

By narsimha lodeFirst Published Jul 15, 2020, 3:38 PM IST
Highlights

సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ తుది ఫలితాలను బుధవారం నాడు విడుదల చేశారు. సీబీఎస్ఈ తన అధికారిక వెబ్ సైట్ లో పలితాలను వెల్లడించింది. 

హైదరాబాద్:సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ తుది ఫలితాలను బుధవారం నాడు విడుదల చేశారు. సీబీఎస్ఈ తన అధికారిక వెబ్ సైట్ లో పలితాలను వెల్లడించింది. 

టెన్త్ పరీక్షలు రాసిన 91.46 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే 0.36 శాతం విద్యార్థులు ఎక్కువ మంది పాసయ్యారు. గత ఏడాది 91.10 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు.

also read:జగన్ సర్కార్ గుడ్‌న్యూస్: టెన్త్ విద్యార్థులను పాస్ చేస్తూ జీవో జారీ

ఈ ఏడాది బాలుర కంటే బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 93.31 శాతం విద్యార్థులు ఉత్తీర్థత సాధించారు. బాలురు కేవలం 90.14 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 

41,804 మంది విద్యార్థులు 95 శాతం మార్కులను సాధించినట్టుగా సీబీఎస్ఈ ప్రకటించింది. ఈ ఏడాది 18 లక్షల మంది టెన్త్ పరీక్షలు  రాశారు. ఈ నెల 14వ తేదీన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను సీబీఎస్ఈ విడుదల చేసింది.

టెన్త్ పరీక్ష ఫలితాలను www. cbseresults.nic లేదా www.cbse.nic.in సైట్లలో చూడవచ్చని సీబీఎస్ఈ ప్రకటించింది. మరో వైపు 011-24300699 నెంబర్ కు ఫోన్ చేసి కూడ ఫలితాలను తెలుసుకోవచ్చని సీబీఎస్ఈ తెలిపింది.

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 19వ తేదీ తర్వాత  జరగాల్సిన పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసింది. రద్దు చేసిన పరీక్షలకు సంబంధించి ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మార్కులు వేశారు.

click me!