ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ పుట్టుకతో ఓబీసీ కాదని, ఆయన సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్‌లో ఆ కులాన్ని ఓబీసీలో చేర్చారని వివరించారు. మోడీ ఘాంచి కులంలో జన్మించారని, ఆ కులాన్ని 2000లో ఓబీసీలో చేర్చారని పేర్కొన్నారు.
OBC Caste: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ పుట్టుకతో ఇతర వెనుకబడిన తరగతు(ఓబీసీ)లకు చెందినవారు కాదని అన్నారు. ఆయన తనను తాను ఓబీసీ అని చెప్పుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉన్నారు. ఈ యాత్రలో భాగంగా ఒడిశాలోని జార్సుగూడలో ఓ చిన్న ప్రసంగంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. జనరల్ క్యాస్ట్‌కు చెందిన ఓ కుటుంబంలో మోడీ జన్మించారని వివరించారు.
‘మోడీజి తాను ఓబీసీ అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన ఘాంచి కులానికి చెందిన కుటుంబంలో జన్మించారు. బీజేపీ ప్రభుత్వం గుజరాత్‌లో అధికారంలో ఉన్న కాలాన 2000లో ఈ కులాన్ని ఓబీసీలో కలిపారు.’ అని రాహుల్ చెప్పారు. ‘గుజరాత్ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత మోడీ తన కులాన్ని ఓబీసీగా మార్చుకున్నారు. కాబట్టి, మోడీజీ పుట్టుకతో ఓబీసీ కాదు’ అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.
Also Read : KCR: అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ డుమ్మా.. ఎందుకు?
రాహుల్ గాంధీ గతంలో మోడీ తెలి కులానికి చెందినవారని అన్నారు. అయితే.. ఆ తర్వాత ఆయన వివరణ ఇస్తూ.. ఆయన ఘాంచి కులంలో పుట్టారని స్పష్టత ఇచ్చారు.