Rahul Gandhi: బీజేపీపై కలిసిక‌ట్టుగా పోరాడాలి.. రాహుల్ గాంధీ పిలుపు.. 

By Rajesh KFirst Published Aug 3, 2022, 8:19 PM IST
Highlights

Rahul Gandhi: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్ర‌జ‌ల్లో చీలిక‌ను తీసుకువ‌చ్చి క‌ర్నాట‌క‌లో విద్వేషం వెద‌జ‌ల్లుతోంద‌ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కాషాయ ద‌ళానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల్లో సామ‌రస్యాన్ని పెంపొందించేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని అన్నారు.

Rahul Gandhi: భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్ర‌జ‌ల్లో చీలిక‌ను తీసుకువ‌చ్చి క‌ర్నాట‌క‌లో విద్వేషాలను వ్యాప్తి చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. కాషాయ ద‌ళానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల్లో సామ‌రస్యాన్ని పెంపొందించేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని అన్నారు. బుధ‌వారం దావణగెరెలో జరిగిన కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య 75వ జన్మదిన వేడుకల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా 
ఆయన మాట్లాడుతూ.. తాను సాధార‌ణంగా ఇలాంటి బ‌ర్త్‌డే వేడుక‌ల‌కు హాజ‌రు కాన‌ని, అయితే సిద్ధ‌రామ‌య్య‌గారితో ఉన్న ప్ర‌త్యేక అనుబంధంతోనే వ‌చ్చాన‌ని చెప్పుకొచ్చారు.

క‌ర్నాట‌క మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య పాల‌న ఆద‌ర్శంగా సాగింద‌ని, రాష్ట్ర ప్ర‌జల‌ను ఆయ‌న స‌రైన దిశ‌లో న‌డిపించార‌ని అన్నారు. కానీ, బీజేపీ పాల‌న అందుకు పూర్తి  భిన్నంగా సాగుతోంద‌ని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే స్వచ్ఛమైన, నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం కృషి చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. 

గత కొద్దిరోజులుగా కర్ణాటకలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు ఆటంకం క‌లిగింద‌నీ,  రాష్ట్రంలో ఇంతకుముందెన్నడూ ఇలాంటి హింస జరగలేదన్నారు. కర్ణాటక గురించి ఏమనుకుంటున్నారని ప్రజలను అడిగితే.. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే సామరస్యం ఉందని చెబుతారని ఆయన అన్నారు. 

వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించడం గమనార్హం. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..  ముఖ్యమంత్రి పదవి రేసులో శివకుమార్, సిద్ధరామయ్య ముందంజలో ఉంటారని భావిస్తున్నారు.

ఇక బీజేపీ ప్రభుత్వం ఏ స్థాయిలో అవినీతి మ‌యమైందో.. కర్ణాటక మొత్తం చూస్తోందన్నారు. కర్ణాటక సంస్కృతి, భాష,  సంప్రదాయాన్ని తాము నమ్ముతామనీ,  భాష, సంస్కృతి,  చరిత్ర.. భారతదేశ భవిష్యత్తుకు ప్రాథమికమైనవ‌నీ.. ఎందుకంటే అన్ని భాషలు, చరిత్రలు, సంస్కృతులు భారతదేశాన్ని నిర్మించాయ‌ని తాము నమ్ముతున్నామనీ, కర్నాటకపై బీజేపీ ఒక్క ఆలోచనను ప్రయోగించాలనుకుంటోంది. కర్నాటకను బీజేపీ వలసరాజ్యంగా మార్చాల‌ని భావిస్తుంద‌ని ఆరోపించారు.  కర్ణాటక అభివృద్ధికి సహకరించాలన్నారు. కర్నాటకలోని బలహీన ప్రజలు బలపడాలని  కోరుకుంటున్నామని అన్నారాయన.

అంతకుముందు.. ఉద‌యం కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విద్యాపీఠంలో రాహుల్ గాంధీ ప్ర‌త్యేక‌ ప్రార్థనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు సాధికారత కల్పించడంలో విద్యాపీఠం అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. ఈ విద్యాపీఠం 150 విద్యా, సాంస్కృతిక సంస్థల ద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలను  శక్తివంతం చేయడానికి ప్ర‌య‌త్నిస్తుంద‌ని ప్ర‌శంసించారు. 

విద్యాపీఠం అధ్యక్షులు శ్రీ శివమూర్తి మురుగ శరణారావును కాంగ్రెస్‌ నాయకులు శాలువాతో సత్కరించారు. మురుగ శరణు గారి నుంచి రాహుల్ గాంధీ  'ఇష్టలింగ దీక్షే' అందుకున్నారు. ఆయనను దర్శి సత్కరించి బసవన్న చిత్రపటాన్ని బహుమతిగా అందజేశారు. తరువాత.. రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో ట్విట్ చేస్తూ.. గురువు బసవన్న బోధనలు శాశ్వతమైనవి, మఠంలోని శరణారావు నుండి దాని గురించి మరింత తెలుసుకోవడానికి వినయపూర్వకంగా భావిస్తున్నానని అన్నారు. 

శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విద్యాపీఠం అనేది గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లోని సామాన్య ప్రజలందరికీ విద్యను అందిస్తుంది. ఈ విద్యా పీఠం 1964లో శ్రీమఠం యొక్క అప్పటి పీఠాధిపతి అయిన జగద్గురువు శ్రీ శ్రీ మల్లికార్జువా మురుగరాజేంద్ర మహాస్వామీజీచే ప్రారంభించబడింది. ప్రస్తుతం 150 సంస్థలను నడుపుతోంది. 

click me!