Shahjahanpur: 28 ఏళ్ల తర్వాత అత్యాచార బాధితురాలికి న్యాయం.. న్యాయస్థాన పోరాటంలో అండ‌గా నిలిచిన కొడుకు

By Rajesh KFirst Published Aug 3, 2022, 7:18 PM IST
Highlights

Shahjahanpur: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో కుమారుడి పోరాటంతో 28 ఏళ్ల తర్వాత అత్యాచార బాధితురాలికి న్యాయం జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 

Shahjahanpur: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో 28 ఏళ్ల తర్వాత అత్యాచార బాధితురాలికి న్యాయం జరిగింది. ఈ సుదీర్ఘ పోరాటంలో ఆ బాధితురాలకు త‌న‌ కొడుకు అండ నిలిచాడు. ఎన్ని అడ్డంకులు వచ్చిన త‌న త‌ల్లికి బాస‌ట‌గా ఉన్నాడు. చివ‌రికి ఈ పోరాటంలో న్యాయం గెల‌వ‌డంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. రెండో నిందితుడి కోసం పోలీసులు గాలింపులు చేప‌ట్టారు. 

హృదయ విదారకమైన ఘ‌ట‌న‌..1994లో జ‌రిగింది. ఆమెకు 13 ఏళ్లు. త‌ల్లిదండ్రులు లేక‌పోవ‌డంతో త‌న మేన‌త్తతో క‌లిసి ఇందిరా నగర్‌లోని ఒక ప్రాంతంలో నివసించేది. పొరుగింట్లో ఉండే.. ఇద్ద‌రూ సోద‌రులు  ఆమెపై క‌న్నేశారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో.. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ దారుణ విష‌యాన్ని ఎవ‌రికైనా చెప్పితే.. చంపేస్తామని బెదిరించారు. అలా ఆ బాలిక‌పై దాదాపు ఏడాది పాటు త‌మ లైంగిక వాంఛ తీర్చుకున్నారు. దీంతో ఆ బాలిక 13 ఏండ్ల‌కే గర్భవతి అయింది. . విషయం తెలుసుకున్న ఆ బాలిక మేనత్త.. నిందితులను ప్ర‌శ్నించ‌గా.. చంపేస్తామని బెదిరించారు. వారిపై దాడి చేశారు. దీంతో భయపడి ఆ బాలికను తీసుకుని వేరే ఊరికి వెళ్లిపోయింది.  9 నెలల తర్వాత.. ఆ బాలిక   ఒక మ‌గ బిడ్డ‌కు జన్మనిచ్చింది. ఈ నవజాత శిశువును హర్దోయ్ జిల్లాకు చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. త‌నపై జ‌రిగిన దారుణాన్ని దిగ‌మింగి.. మ‌రో కొత్త జీవితాన్ని ప్రారంభించాల‌ని భావించింది. 2000వ సంవత్సరంలో ఘాజీపూర్ జిల్లాలోని ఒక వ్యక్తి  వివాహం చేసుకుంది. కొంతకాలం తర్వాత.. ఆమెపై జ‌రిగిన అత్యాచారం గురించి తెలుసుకున్న ఆ వ్యక్తి.. విడాకులు ఇచ్చాడు. 

కాగా, తన తల్లి గురించి అసలు విషయం తెలుసుకున్న మొదటి కొడుకు  లక్నోలోని తన తల్లి వద్దకు చేరుకున్నాడు. న్యాయ‌పోరాటానికి దిగాడు. ఆ కొడుకు కోరిక మేరకు.. దాదాపు 27 సంవత్సరాల తర్వాత.. ఆ బాధితురాలు.. నిందితులిద్దరిపై (మార్చి 4, 2021 న) రేప్ కేసు పెట్టింది. ఈ త‌రుణంలో నిందితులిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి..  పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

విషయం చాలా పాతది కావడంతో పోలీసులు నిందితులకు DNA పరీక్ష చేయించారు. DNA రిపోర్టు పాజిటివ్‌గా వచ్చింది. తక్షణమే చర్యలు తీసుకున్న పోలీసులు  ఒక నిందితుడిని సదర్ బజార్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మ‌రో నిందితుడు పరారీలో ఉన్నాడు.  రెండో నిందితుడి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.
 

click me!