నేషనల్ హెరాల్డ్ కేసు:యంగ్ ఇండియన్ ఆఫీస్ కార్యాలయం సీజ్ చేసిన ఈడీ

By narsimha lodeFirst Published Aug 3, 2022, 6:45 PM IST
Highlights

నేషనల్ హెరాల్డ్ కేసులో బుధవారం నాడు కీలక పరిణామం చోటు చేసుకొంది. ఢిల్లీలోని యంగ్ ఇండియన్ కార్యాలయాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. 

న్యూఢిల్లీ: National Herald case కేసులో బుధవారం నాడు కీలక పరిణామం చోటు చేసుకొంది.  యంగ్ ఇండియా కార్యాలయాన్ని ఈడీ అధికారులు బుధవారం నాడు సీజ్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో గతంలోనే కాంగ్రెస్ చీఫ్ Sonia Gandhi ఆ పార్టీ మాజీ చీఫ్ Rahul Gandhiలను ఈడీ అధికారులు ప్రశ్నించారు. 

మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ భవనంలో ఉన్న యంగ్ ఇండియన్ లిమిటెడ్ కార్యాలయాన్ని ఈడీ అధికారులు ఇవాళ సీజ్ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఈ కార్యాలయం తెరవవద్దని కూడా Enforcement Directorate అధికారులు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు. సోనియా గాంధీ నివాసం వద్ద కూడ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

దీంతో ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సల్మాన్ ఖుర్షీద్, మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సాల్, పి.చిదంబరం సహా సీనియర్ నేతలతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు భేటీ అయ్యారు. నేషనల్ హెరాల్డ్ ను నెహ్రు, సర్ధార్ వల్లభాయ్ పటేల్ తదితరులు స్వాతంత్ర్య పోరాటంలో భారత ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ప్రారంభించారు. ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ హౌస్ లో నేషనల్  హెరాల్డ్ కార్యాలయాలపై ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్  అధికారులు నిన్న సోదాలు చేశారు. ఏజేఎల్ తో అనుసంధానించిన మరో పదకొండు ప్రాంతాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.  ఈ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ అధికారులు సుమారు 50 గంటలకు పైగా ప్రశ్నించారు. 

ఈడీ అధికారుల దాడుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా నిరసనలకు దిగింది. నేషనల్ హెరాల్డ్ కార్యాలయంపై ఈడీ దాడులను కాంగ్రెస్ పై సాగుతున్న దాడికి ఆ  పార్టీ నేతలు పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ ను నడుపుతున్న అసోసియేటేడ్ జర్నల్స్ లిమిటెడ్ ను వైఐఎల్ స్వాధీనం చేసుకొంది. 

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని, గత మాసంలోనే ఈడీ అధికారులు విచారించారు.అంతకు ముందు రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించారు.  ఈ ఇద్దరిని ఈడీ అధికారులు విచారించే సమయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేశ వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. న్యూఢిల్లీతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో పార్టీ క్యాడర్ ఆందోళనలు నిర్వహించింది. ఢిల్లీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేశారు.ఈ ఆందోళనలో ఆ పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. 

also read:Rahul Gandhi: బీజేపీపై కలిసిక‌ట్టుగా పోరాడాలి.. రాహుల్ గాంధీ పిలుపు..

 సోనియా గాంధీని ఈడీ అధికారులు  గతా నెలలో మూడు రోజుల పాటు ప్రశ్నించారు.  యంగ్ ఇండియన్ కంపెనీ కూడా ఏజేఎల్ యొక్క ఆస్తులలో రూ. 800 కోట్లకు పైగా తీసుకుందని ఈడీ  పేర్కొంది. .యంగ్ ఇండియన్ లాభాపేక్ష లేని కంపెనీ అని అందువల్ల మనీలాండరింగ్ గురించి ప్రశ్నకే ఆస్కారం లేదని కాంగ్రెస్ చెబుతుంది.తొలుత బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఈ విషయమై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఈ పిర్యాదు మేరకు ఈడీ అధికారులు విచారణను ప్రారంభించారు. 

click me!