రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ తిరిగి ప్రయోగిస్తున్న ఒక ఫెయిల్డ్ మిస్సైల్- కర్ణాటక సీఎం బొమ్మై

By team teluguFirst Published Oct 15, 2022, 4:21 PM IST
Highlights

రాహుల్ గాంధీ ఒక విఫల క్షిపణి అని, ఆయనను కాంగ్రెస్ పాద యాత్ర ద్వారా తిరిగి ప్రయోగిస్తోందని బీజేపీ నాయకుడు, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రకు అర్థం లేదని చెప్పారు. 

భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రయోగిస్తోందని, అయితే ఆయన విఫమైన క్షిపణి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. దేశం ఇప్పటికే ఐక్యంగా ఉన్నప్పుడు మరియు ఫెడరలిజంపై పూర్తి విశ్వాసం ఉన్న సమయంలో ఇలాంటి పాదయాత్ర చేయడం అర్థరహితమని బొమ్మై అన్నారు. దేశం ఇప్పటికే ఐక్యంగా ఉందని, ఫెడరలిజంపై అందరికీ పూర్తి విశ్వాసం ఉన్న ఈ సమయంలో ఇలాంటి పాదయాత్ర చేయడం అర్థరహితమని అన్నారు.

కాపీ కొడుతున్నదనే అనుమానంతో పరీక్ష రాస్తున్న బాలిక బట్టలు విప్పించాడు.. అవమానంతో నిప్పంటించుకున్న విద్యార్థిని

ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం బలీయంగా ఉన్నప్పుడు ఈ భారత్ జోడో యాత్రకు అర్థం లేదని.. గతంలో తాను చెప్పినట్లు రాహుల్ గాంధీ అనే క్షిపణి విఫలమైందని.. దానిని మళ్లీ ప్రయోగిస్తున్నారని అన్నారు. ఫెడరలిజంపై విశ్వాసంతో దేశం ఐక్యంగా పురోగమిస్తున్నప్పుడు యాత్ర వెనుక ఉద్దేశ్యాన్ని తెలుసుకోవాలని ఆయన కోరారు.

చైనా సరిహద్దులో ఇద్దరు భారత యువకులు అదృశ్యం.. కొనసాగుతున్న సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్

‘‘దేశం ప్రపంచవ్యాప్తంగా పటిష్టమైన రీతిలో ముందుకు సాగుతోంది. భారత్‌ను ఏకం చేసే అవసరం ఇప్పుడు లేదు. G-7 దేశాలతో సహా అన్ని దేశాలు ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారతదేశం 7 శాతం వృద్ధితో ముందుకు సాగుతోంది. "  అని ఆయన అన్నారు.

కర్ణాటకలో ప్రతీ జిల్లాలో కనీసం రెండు నియోజకవర్గాలను కవర్ చేస్తూ గత నాలుగు రోజులుగా మూడు జిల్లాల్లో బీజేపీ తలపెట్టిన ‘జన సంకల్ప యాత్ర’ ను ప్రస్తావిస్తూ.. తమకు అపూర్వమైన మద్దతు లభించిందని, ఇది తమ అంచనాలకు మించినదని సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు.

ఆకలి సూచీలో దిగజారిన భారత్.. మనకంటే మెరుగ్గా పాక్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి పొరుగు దేశాలు

‘‘ ఈ జనసంకల్ప యాత్ర (ప్రజలకు నిబద్ధత కోసం యాత్ర) విజయ సంకల్ప యాత్రగా (విజయ యాత్రకు తీర్మానం) రూపాంతరం చెందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 2023లో అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో 150 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యాన్ని చేరుకుంటామని నేను విశ్వసిస్తున్నాను ’’అని సీఎం చెప్పారు.

click me!