national herald case : లంచ్ తర్వాత తిరిగి ప్రారంభమైన ఈడీ విచారణ.. రాహుల్‌పై ప్రశ్నల వర్షం

Siva Kodati |  
Published : Jun 13, 2022, 04:34 PM ISTUpdated : Jun 13, 2022, 04:35 PM IST
national herald case : లంచ్ తర్వాత తిరిగి ప్రారంభమైన ఈడీ విచారణ.. రాహుల్‌పై ప్రశ్నల వర్షం

సారాంశం

నేషనల్ హెరాల్డ్ కేసులో లంచ్ విరామం తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఈడీ అధికారులు రెండో విడత ప్రశ్నిస్తున్నారు. అంతకుముందు ఈడీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లిన రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు

నేషనల్ హెరాల్డ్ కేసులో (national herald case) రాహుల్ గాంధీని (rahul gandhi) విచారిస్తున్నారు అధికారులు. తొలి విడతలో మూడు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు (enforcement directorate) లంచ్ విరామం తర్వాత మరోసారి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నేషనల్ హెరాల్డ్‌తో రాహుల్‌కు వున్న సంబంధాలేంటీ.?? ఏజేఎల్‌లో ఆయన స్థానమేంటీ..? యంగ్ ఇండియా సంస్థలో ఆయన పాత్ర ఏంటీ..? యంగ్ ఇండియాలో రాహుల్ పేరు మీద షేర్లు వున్నాయా..? అంటూ ప్రశ్నించారు ఈడీ అధికారులు. షేర్ హోల్డర్లతో ఎప్పుడు సమావేశమయ్యారు. యంగ్ ఇండియాకు కాంగ్రెస్ రుణం ఇవ్వడానికి కారణమేంటీ..? దివాళా తీసిన నేషనల్ హెరాల్డ్‌ను మళ్లీ ఎందుకు నడపాలని అనుకున్నారు?. వంటి ప్రశ్నలను రాహుల్‌పై స్పందించారు ఈడీ అధికారులు. తొలి విడతలో మూడు గంటల పాటు ప్రశ్నించిన తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చారు. దీంతో ఈడీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లారు రాహుల్ గాంధీ. అనంతరం ఆయన సోనియా గాంధీ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. 

Also REad:National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటీ? సోనియా, రాహుల్‌కు సంబంధం ఏమిటీ?

కాగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కాంగ్రెస్ అధ్యక్షురాలు (congress) సోనియా గాంధీకి  ఆమెకు కొడుకు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి (rahul gandhi) సమన్లు పంపడంతో మరోసారి నేషనల్ హెరాల్డ్ కేసు చర్చలోకి వచ్చింది. ఈ రోజు రాహుల్ గాంధీ ఈడీ ముందు హాజరయ్యారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగాయి. దేశవ్యాప్తంగా సుమారు 25 ఈడీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి రాహుల్ గాంధీ బయల్దేరగా.. ఆయన వెంట ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు వచ్చారు. కార్యాలయం వరకు మార్చ్ చేశారు. రెండు బారికేడ్లు దాటేసినా.. మూడో బారికేడ్ వద్ద పోలీసులు బలగాలు భారీగా ఉండటంతో నిరసనకారులు, ప్రియాంక గాంధీ మరికొందరు నేతలు అక్కడే నిలిచిపోయారు. రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. 

నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటీ?

రూ. 2000 కోట్ల విలువలైన అసెట్స్‌ ఈక్విటీ ట్రాన్సాక్షన్‌లో అవకతవకలకు సంబంధించినదే ఈ కేసు. నేషనల్ హెరాల్డ్ పేపర్‌కు ఆర్థిక సమస్యలు తలెత్తినప్పుడు కాంగ్రెస్ పార్టీ పలుదఫాలుగా సొమ్ము అందించింది. సుమారు రూ. 90 కోట్లు అందించినా 2008లో ఈ పత్రిక మూతపడక తప్పలేదు.

అయితే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బోర్డు డైరెక్టర్లుగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది స్థాపితమైంది. ఈ యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ 2010లో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌ను టేకోవర్ చేసుకుంది. అనంతరం బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి ఈ వ్యవహారంపై ఆరోపణలు సంధించారు. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్‌ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ మోసపూరితంగా అధీనం చేసుకుందని కంప్లైంట్ చేశారు. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం, పొలిటికల్ సంస్థ థర్డ్ పార్టీతో ఆర్థిక లావాదేవీలు జరపరాదు.

అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు సంబంధించిన ఆస్తులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎక్కువ మొత్తంలో లాభంతోనే సొంతం చేసుకున్నారని స్వామి ఆరోపించారు. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కేవలం రూ. 50 లక్షలు చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన ఆస్తులను రికవరీ చేసుకునే హక్కును పొందింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కాంగ్రెస్‌కు బాకీపడ్డ సుమారు రూ. 89.5 కోట్లు రద్దు అయినట్టు స్వామి ఆరోపించారు. తద్వార ఆ సొమ్ము అంతా వీరు పొందారని (మనీలాండరింగ్?) సుబ్రమణియన్ స్వామి ఫిర్యాదు చేశారు.

2016 నుంచి ఈడీ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌, పలువురు కాంగ్రెస్ లీడర్లను ఇన్వెస్టిగేట్ చేస్తున్నది. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కేవలం చారిటీ కోసం స్థాపించిన ఎన్జీవో సంస్థ అని కాంగ్రెస్ వాదిస్తున్నది. ఈ ట్రాన్సాక్షన్స్ కమర్షియల్ అని, ఫైనాన్షియల్ కాదని పేర్కొంటున్నది. అసలు ఆస్తులు లేదా నగదు అనేది బదిలీనే కాలేదుని, అలాంటప్పడు మనీలాండరింగ్ కేసు ఎలా అవుతుందని అభిషేక్ సింఘ్వీ వాదిస్తున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu