కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా.. రాహుల్

By ramya neerukondaFirst Published Aug 24, 2018, 4:06 PM IST
Highlights

బీజేపీ అధికారంలోకి లేని రాష్ట్రాల్లో పాలనను ప్రధాని మోదీ బలహీనపరుస్తున్నారని రాహుల్ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు దన్నుగా నిలుస్తూ ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాలనను బలహీనపరుస్తున్నారని విమర్శించారు.

 వచ్చే ఎన్నికల్లో తమ కాంగ్రెస్ పార్టీ  గెలిస్తే.. ఏపీ కచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. బెర్లిన్‌లో ఇండియన్ ఓవర్సీ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని భారత ప్రభుత్వం వాగ్దానం చేసిందని, దీన్ని తామంత తేలిగ్గా తీసుకోమని చెప్పారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా కల్పిస్తామని, ఇది ఏపీ ప్రజలకు తాను ఇస్తున్న హామీ అని అన్నారు. బీజేపీ అధికారంలోకి లేని రాష్ట్రాల్లో పాలనను ప్రధాని మోదీ బలహీనపరుస్తున్నారని రాహుల్ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు దన్నుగా నిలుస్తూ ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాలనను బలహీనపరుస్తున్నారని విమర్శించారు.

ప్రధాని మోదీని తాను ఆలింగనం చేసుకున్న అంశంపై అడిగిన ప్రశ్నకు 'నిజాలు కంటే వేగంగా అబద్ధాలు ప్రచారమవుతాయి. మోనీ నిరంతరం నాపైన, ఇతర విపక్ష పార్టీలపై దాడి చేస్తూనే ఉన్నారు. నన్ను రకరకాల పేర్లు పెట్టి పిలుస్తున్నారు. మీరు చెప్పండి, నేను కౌగిలించుకున్న అంశం కంటే అవి వేగంగా ప్రచారంలోకి వచ్చాయా? అభిమానం అనేది చాలా శక్తివంతమైన విషయం. అలాంటి అనుభూతి చెందిన వాళ్లకు మాత్రమే ఆ చర్యలోని అర్ధం అవగతమవుతుంది. వాళ్లలో నైరాశ్యం ఎక్కువైంది. అందుకే అలా వ్యవహరిస్తున్నారు. అలాంటి వాళ్లకు మేం అధికారంలోకి రాగనే సహాయపడతాం' అని రాహుల్ పేర్కొన్నారు.

click me!