వరదల్లో కొడ్ గావ్.. నిర్మాలా సీతారామన్ రూ.కోటి విరాళం

By ramya neerukondaFirst Published Aug 24, 2018, 3:32 PM IST
Highlights

ఆ ప్రాంత వరద బాధితుల కోసం రూ. కోటి విరాళం ఇస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

కేరళ రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. అదేవిధంగా కేరళ-కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కొడ్ గావ్ ని సైతం వరదలు ముంచెత్తాయి. ఆ ప్రాంత వరద బాధితుల కోసం రూ. కోటి విరాళం ఇస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొడ్‌గావ్‌లో ఇవాళ కేంద్రమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో నిర్మలా సీతారామన్ మాట్లాడారు.

 తాను కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైనందున.. ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ. కోటి ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కొడ్‌గావ్‌లో దెబ్బతిన్న రోడ్ల అభివృద్ధికి తక్షణమే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి.. చర్యలు తీసుకుంటామన్నారు. కొడ్‌గావ్‌లో నెలకొన్న పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్తానని నిర్మలా సీతారామన్ తెలిపారు.

click me!