
రాయ్‌పూర్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కీలకమైన ప్రకటన చేశారు.కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు.
సోమవారం నాడు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ ఈ కీలక ప్రకటన చేశారు. దేశంలోని ప్రతి పేదవాడికి కనీస ఆదాయం ఇస్తామని రాహుల్ ప్రకటించారు.
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోనే పేదలకే కాదు దేశంలోనే పేదలకు నిర్ధిష్ట ఆదాయం వచ్చేలా ప్లాన్ చేస్తామని రాహుల్ ప్రకటించారు.పేదలు ఆకలితో అలమటిస్తోంటే నవ భారతాన్ని నిర్మించలేమని రాహుల్ అభిప్రాయపడ్డారు. పేదల ఆకలిని తీర్చేందుకు కొత్త పథకాన్ని ప్రవేశపెడతామని రాహుల్ హామీ ఇచ్చారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకాన్ని తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని రాహుల్ ప్రకటించారు. ఈ పథకం కింద పేదల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తామని రాహుల్ ప్రకటించారు.