కాంగ్రెస్ హద్దులు దాటుతోంది, దిగిపోతా: కుమారస్వామి

By narsimha lodeFirst Published Jan 28, 2019, 4:35 PM IST
Highlights

కర్ణాటకలో చోటు చేసుకొంటున్న రాజకీయ పరిణామాలపై ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామిచ సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు


బెంగుళూరు: కర్ణాటకలో చోటు చేసుకొంటున్న రాజకీయ పరిణామాలపై ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామిచ సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాటి ప్రవర్తిస్తున్నారని కర్ణాటక సీఎం కుమారస్వామి  ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోమవారం నాడు కర్ణాటక సీఎం కుమారస్వామి కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇలానే వ్యవహరిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. సిద్దరామయ్య తమ నాయకుడని ఆయనే సీఎం కావాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై కుమారస్వామి తీవ్రంగా స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలానే చేస్తానంటే  నా పదవికి రాజీనామా చేయడానికి కూడ తాను సిద్దంగా ఉన్నానని కుమారస్వామి హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలని  కుమారస్వామి అభిప్రాయపడ్డారు.

ఈ వివాదంపై కాంగ్రెస్‌ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం జి పరమేశ్వర స్పందించారు. సిద్దరామయ్య గొప్ప సీఎం. ఆయన మా సీఎల్పీ నేత. సిద్దరామయ్య సీఎం అయితే బాగుండేదని ఓ ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని చెప్పారు.

మాజీ సీఎం సిద్దరామయ్య కూడ ఈ విషయమై  స్పందించారు.తమ పార్టీ సీఎం కుమారస్వామితో బాగానే ఉన్నట్టు చెప్పారు. తమ కూటమిలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. మీడియానే తమ మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ కూడ మీడియా ముందు అనవసర వ్యాఖ్యలు చేయకూడదని లోక్‌సభలో విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే సూచించారు. 
 

click me!