ఎన్నికల షెడ్యూల్ ముంగిట్లో రాహుల్ గాంధీ విదేశీ పర్యటన.. టైమింగ్‌పై చర్చ.. ఎన్నిసార్లు ఫారీన్ వెళ్లాడంటే..?

Published : Dec 30, 2021, 04:13 PM IST
ఎన్నికల షెడ్యూల్ ముంగిట్లో రాహుల్ గాంధీ విదేశీ పర్యటన.. టైమింగ్‌పై చర్చ.. ఎన్నిసార్లు ఫారీన్ వెళ్లాడంటే..?

సారాంశం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మరో వారం లేదా పది రోజుల్లో విడుదల అవుతున్న తరుణంలో రాహుల్ గాంధీ తాజాగా, ఇటలీ ప్రయాణమై వెళ్లిపోయాడు. గతంలోనూ ఆయన చాలా సార్లు దేశంలో చాలా కీలకమైన పరిస్థితుల్లోనూ విదేశాలకు వెళ్లారు. ఆయన పర్యటన ఎప్పుడు చేసిన ఆ పర్యటన టైమిం్పై చర్చ జరుగుతున్నది.  

న్యూఢిల్లీ: కాంగ్రెస్(Congress) మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోసారి విదేశాల(Foreign Trips)కు వెళ్లారు. ఈ సారి ఇటలీ(Italy) వెళ్లారు. ఇటలీలో రాహుల్ గాంధీ అమ్మమ్మ ఉంటారన్న సంగతి తెలిసిందే. వచ్చే వారం తొలి వారంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ ప్రకటించనుంది. సరిగ్గా, ఈ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ ట్రిప్‌ దెబ్బతో పంజాబ్‌లో మోగా ర్యాలీ దెబ్బతిననుంది. పంజాబ్‌(Punjab)లో ఇప్పటికీ సిద్దూ, తాజా సీఎం చన్నీకి మధ్య చెడినట్టు వార్తలు వచ్చాయి. ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తున్న తరుణంలో వారందరినీ ఏక తాటి మీదకు తేవాల్సిన అవసరం ఉన్నది. అలాగే, ఢిల్లీ సరిహద్దు నుంచి పంజాబ్‌కు రైతులు తిరిగి వెళ్లి పోయిన సంగతి తెలిసిందే. రైతులతోనూ ఆయన కలుసుకుని మాట్లాడాల్సిన పని ఉన్నది. కానీ, ఇవన్నీ పక్కన పెట్టి రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు చెక్కేయడంపై అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి.

కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఉన్న మోగాలో ఓ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడటంపై రాహుల్ గాంధీ షెడ్యూల్ ఫిక్స్ అయింది. కానీ, ఆయన ఇటలీకి వెళ్లడంతో ఈ ర్యాలీ వాయిదా పడింది. రాహుల్ గాంధీ తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాతే ఈ ర్యాలీలో మాట్లాడబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతున్న సందర్భంలో ఆయన విదేశాలకు వెళ్లిపోవడం కాంగ్రెస్ శ్రేణుల్లోనూ అసంతృప్తిని రగిల్చింది. ఎన్నికల కోసం పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలు అనుసరించాల్సి ఉందని, కానీ, ఇలాంటి కీలక సమయంలో రాహుల్ గాంధీ బయటి దేశానికి వెళ్లిపోయాని పేర్కొన్నారు. వచ్చే ఏడాది తొలినాళ్లలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం పెద్దగా కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ గట్టిగా కొట్టాడటానికి పంజాబ్, ఉత్తరాఖండ్‌లో అవకాశాలు ఉన్నాయి.  ఇప్పటికే రాహుల్ గాంధీని బీజేపీ ఈ విషయమై చాలా సార్లు విమర్శలు చేసింది. రాహుల్ గాంధీ కేవలం పార్ట్ టైమ్ నేత అని, ఆయన విదేశాలకు వెళ్లడానికే ఎక్కువ ఆసక్తి చూపుతారని ఆరోపించింది. తృణమూల్ కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ నాయకత్వంపై సీరియస్ అయింది. రాజకీయాలపై వారు సీరియస్‌గా లేకుంటే.. దానికి ప్రజలు ఎందుకు బాధ్యులవ్వాలని, వారెందరూ బాధపడాలని కాంగ్రెస్‌పై పరోక్షంగా విమర్శలు చేసింది.

Also Read: ఆ విషయంలో ప్ర‌ధాని నా మాట విన్నారు: Rahul Gandhi

ఈ ఏడాది రాహుల్ గాంధీ 25 రోజులు విదేశాల్లోనూ గడిపాడని, ఈ ఏడాదిలో రాహుల్ గాంధీ నాలుగు ట్రిప్పులు వేశారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాహుల్ గాంధీ ఎప్పుడు పర్యటన చేసినా.. ఏదో ఒక కీలక అంశం దేశంలో రగులుతున్న సందర్భంలోనే ఆయన పర్యటనలు ఉండటం గమనార్హం. చివరి సారి పార్లమెంటు శీతాకాల సమావేశానికి కొన్ని రోజుల ముందే ఆయన విదేశాలకు వెళ్లారు. సరిగ్గా సమావేశాలకు ఒక్క రోజు ముందే ఆయన తిరిగి భారత్ వచ్చారు.

Also Read: Rahul Gandhi: మోడీ స‌ర్కారు ఏర్ప‌డ్డాకే మూకదాడులు.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

కాగా, సీఏఏ వ్యతిరేక ఆందోళనలు దేశవ్యాప్తంగ రగులుతుండగా ఆయన ఓ సెమినార్ ఇవ్వడానికి సింగపూర్ వెళ్లారు. మహారాష్ట్ర, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడూ ఆయన థాయ్‌లాండ్ వెళ్లారు. తన థాయ్‌లాండ్ పర్యటనతో మహారాష్ట్ర, హర్యానాల్లో ఆయన పాల్గొనాల్సిన ప్రచార క్యాంపెయిన్‌లను కొన్నింటినీ రద్దు చేశారు. గతేడాది డిసెంబర్‌లోనూ ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలు తీవ్రంగా జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ ఇటలీకి వెళ్లారు. ఆయన రైతుల సమస్యను బేఖాతరు చేశారని రైతు నేతలే రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sabarimala Karthika Deepam: స్వామియే శరణం.. శబరిమల కార్తీక దీపం చూశారా? | Asianet News Telugu
Putin RaGhat Visit:రాజ్ ఘాట్ సందర్శించనున్న పుతిన్.. ఢిల్లీలో భారీగా భద్రత | Asianet News Telugu