ఇటలీకి వెళ్లిన కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ

Published : Dec 27, 2020, 04:22 PM IST
ఇటలీకి  వెళ్లిన కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ

సారాంశం

కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ  ఆదివారం నాడు  ఇటలీకి వెళ్లారు.  ఇటలీలోని మిలాన్ కు వెళ్లినట్టుగా సమాచారం.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ  ఆదివారం నాడు  ఇటలీకి వెళ్లారు.  ఇటలీలోని మిలాన్ కు వెళ్లినట్టుగా సమాచారం.

ఆదివారం నాడు ఉదయం రాహుల్ గాంధీ  ఖతార్ ఎయిర్ లైన్స్ ద్వారా ఇటలీకి వెళ్లారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీ మిలాన్ కు ఎందుకు వెళ్లారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ గత వారంలో రైతుల సమస్యలపై రాష్ట్రపతిని కలిశారు. పార్టీ ఎంపీల బృందంతో కలిసి ఆయన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు.

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ  న్యూఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

రాహుల్ గాంధీ అత్యవసరంగా మిలాన్ కు వెళ్లడం చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీకి అనారోగ్యంగా ఉన్నందున  కొంత కాలం క్రితం సోనియాగాంధీతో కలిసి రాహుల్ గాంధీ గోవాకు వెళ్లిన విషయం తెలిసిందే.

రైతులు చేస్తున్న ఆందోళనల కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్న విషయం తెలిసిందే. 


 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు