స్వదేశీ వస్తువులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: మన్‌కీ బాత్ లో మోడీ

By narsimha lodeFirst Published Dec 27, 2020, 1:36 PM IST
Highlights

దేశీయంగా తయారైన  వస్తువులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. దేశంలోని యువతను చూసినప్పుడల్లా తనలో భరోసా పెరుగుతోందన్నారు.


న్యూఢిల్లీ: దేశీయంగా తయారైన  వస్తువులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. దేశంలోని యువతను చూసినప్పుడల్లా తనలో భరోసా పెరుగుతోందన్నారు.

ఆదివారం నాడు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఏదైనా సాధించగలం చేయగలమన్న సంకల్పం స్పూర్తినిస్తుందన్నారు. ఎంతటి సవాలైనా యువత ముందు చిన్నదేనని చెప్పారు. వారి వల్ల సాధ్యం కానిది ఏదీ లేదన్నారు.

స్వయం సమృద్ది భారత్ లో తయారీ వంటి పలు కీలక అంశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 2021 ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా  దేశ ప్రజలకు మోడీ శుభాకాంక్షలు చెప్పారు.

వచ్చే ఏడాదిలో భారత్ ను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ తీర్మానించుకోవాలని సూచించారు. అంతేకాదు దేశీయంగా తయారైన వస్తువులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ ఏడాది అనేక సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు. కరోనాతో పాటు ఇతర అంశాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలోని పలు ప్రాంతాల నుండి కొందరు  పంపిన అభిప్రాయాలను మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

 

 

దేశంలో తయారీదారులంతా నాణ్యమైన వస్తువుల ఉత్పత్తికి కంకణం కట్టుకోవాలన్నారు. 2020లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు.అయినా ఎక్కడా కూడ వెనకడుగు వేయలేదన్నారు. ప్రతి సవాల్ నుండి ఓ పాఠం నేర్చుకొన్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు.  ఢిల్లీలోని ఝంఝేవాలా మార్కెట్ లో స్వదేశీ ఆట వస్తువులే ఎక్కువగా ఇప్పుడు కన్పిస్తున్నాయన్నారు.

రానున్న రోజుల్లో స్వదేశీ వస్తువులను వాడాలని తీర్మానించుకోవాలని ఆయన ప్రజలను కోరారు.కాశ్మీర్ కేసరికికి ఈ ఏడాది జీఐ ట్యాగ్ లభించిందన్నారు. ఇక దీన్ని అంతర్జాతీయ బ్రాండ్ గా మార్చేందుకు చర్యలు తీసుకొంటామన్నారు.అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వస్తువుల తయారీపై పారిశ్రామికవేత్తలు కేంద్రీకరించాలని ఆయన కోరారు.


 

click me!