ఇండియా కూటమిని ఓడించడం బీజేపీకి సాధ్యం కాదు: రాహుల్ గాంధీ

Published : Sep 01, 2023, 05:02 PM ISTUpdated : Sep 01, 2023, 05:03 PM IST
ఇండియా కూటమిని  ఓడించడం బీజేపీకి సాధ్యం కాదు: రాహుల్ గాంధీ

సారాంశం

ఇండియా కూటమిని ఓడించడం బీజేపీకి సాధ్యం కాదని  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  చెప్పారు. 

ముంబై: లడ్డాఖ్ లో మన భూభాగాన్ని చైనా ఆక్రమణలపై  ప్రధాని మౌనం అవమానకరమైందిగా  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు.ముంబైలో  రెండు రోజుల పాటు  ఇండియా కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశం శుక్రవారం నాడు ముగిసింది.  ఈ సందర్బంగా   ముంబైలో ఇవాళ  రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
ఇండియా కూటమిలోని పార్టీల మధ్య ఐక్యత అసాధ్యమని బీజేపీ విమర్శించిన విషయాన్ని రాహుల్ గాంధీ  ప్రస్తావించారు.

 

 కానీ బీజేపీ  అంచనాలు తారుమారు చేస్తూ  ఇండియా కూటమిలోని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. బీజేపీ ఓటమికి ఇండియా కూటమి బలమైన నిర్ణయాలు తీసుకుందని  రాహుల్ గాంధీ చెప్పారు.ఇండియా కూటమిని ఓడించడం బీజేపీ తరం కాదని రాహుల్ గాంధీ చెప్పారు. ఎన్నికలు చాలా దగ్గరలోనే ఉన్నాయన్నారు.ఈ వేదికపైనే  60 శాతం భారత్ ఉందని  రాహుల్ గాంధీ చెప్పారు.జీ-20 శిఖరాగ్ర సదస్సు త్వరలోనే జరగనుందని  రాహుల్ గాంధీ  తెలిపారు.దేశంలోని నలుగురికి మాత్రమే మోడీ సర్కార్ పనిచేస్తుందన్నారు. 

also read:వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ, 13 మందితో కమిటీ:ఇండియా కూటమి నిర్ణయాలు వెల్లడించిన ఖర్గే

మోడీ, అదానీ మధ్య ఆర్ధిక బంధంపై అన్ని అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. గత వారం తాను లడ్డాఖ్ లో పర్యటించిన  విషయాన్ని ఆయన తెలిపారు. లడ్డాఖ్ లో  చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తుందని ఆయన  ఆరోపించారు.అదానీ గ్రూప్ పై అన్ని ఆరోపణలు వస్తే ఎందుకు విచారణ చేపట్టలేదని ఆయన  ప్రశ్నించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్