కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాహువుగా మారారు - మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

Published : Mar 30, 2023, 11:15 AM IST
కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాహువుగా మారారు - మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

సారాంశం

కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాహువుగా మారారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. దేశ వ్యాప్తంగా  అమృత్ కాల్ నడుస్తోందని, కానీ ఆయన వల్లే ఆ పార్టీకి రాహుకాల్ నడుస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ వెనకబడిన వర్గాలను అవమానించారని తెలిపారు. 

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వయనాడ్ ఎంపీకి దేశం పట్ల,  దాని విధానాల పట్ల అవగాహన లేదని అన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి అశుభ 'రాహు'గా మారారని విమర్శించారు. భోపాల్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియాతో బుధవారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశానికి కాంగ్రెస్ పార్టీ ఒక సమస్య అని, అయితే ఆ పార్టీకి రాహుల్ గాంధే సమస్య అని దేశ ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు ఆయన రాహువుగా మారడం వల్లే, దేశ వ్యాప్తంగా అమృత్ కాల్ నడుస్తున్నా.. ఆ పార్టీకి మాత్రం రాహుకాల్ నడుస్తోందని చెప్పారు.

భారత్-పాక్ సరిహద్దుల్లో భారీ పేలుడు.. కొన‌సాగుతున్న సెర్చ్ ఆప‌రేష‌న్

‘‘గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందిన బానిస నాయకులు (కాంగ్రెస్ వాదులను ఉద్దేశిస్తూ) ఆయనను (రాహుల్ గాంధీని) బలవంతంగా జాతీయ నాయకుడిగా చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే వాస్తవం ఏమిటంటే రాహుల్ గాంధీ గాంధీ-నెహ్రూ కుటుంబంలో అత్యంత విఫలుడు, బలహీనుడు, బాధ్యతారాహిత్యుడు. నిర్లక్ష్యపూరితమైన, అహంకారపూరిత నాయకుడు’’ అని చౌహాన్ ఆరోపించారు. 2013లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఎన్నికల అనర్హత చట్టంపై జారీ చేసిన ఆర్డినెన్స్ ను చింపివేయడం రాహుల్ గాంధీ అహంకారపూరిత చర్య కాదా అని ప్రశ్నించారు.

అహంకారంలో రాహుల్ గాంధీ వివిధ వర్గాలను, కులాలను కించపరుస్తున్నారని శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. వెనుకబడిన వర్గాలు తనను సవాలు చేయలేవని రాహుల్ గాంధీకి తెలుసని, కానీ అందుకే వారిని దూషించారని, ఆ వర్గం మొత్తాన్ని దొంగ అని పిలిచారని ఆరోపించారు. ఇది అహంకారం కాకపోతే ఇదేమిటో రాహుల్ గాంధీ చెప్పాలని అన్నారు. ఆ తరువాత కూడా క్షమాపనలు చెప్పబోనని ఆయన చెప్పారని, కానీ వెనకబడిన వర్గానికి చెందిన తామే రాహుల్ గాంధీని క్షమించబోమని చౌహాన్ అన్నారు. ఇప్పటికైతే ఎంపీ సభ్యత్వం, బంగ్లాను మాత్రమే కోల్పోయారని, మళ్లీ వెనకబడిన వర్గాలను చెలగాటమాడేందుకు ప్రయత్నిస్తే.. ఏదో ఒక రోజు కాంగ్రెస్ ఉనికి కూడా కనుమరుగవుతుందని అన్నారు. 

మహారాష్ట్రలో ఉద్రిక్తత.. కిరాద్‌పురా రామమందిరం వెలుపల ఇరువర్గాల రాళ్ల దాడి.. వాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు..

తమ నాయకులకు వ్యతిరేకంగా కోర్టు ఇచ్చిన తీర్పులను గౌరవించకపోవడం, దళితులను, వెనుకబడిన వారిని గౌరవించకపోవడం కాంగ్రెస్ పార్టీ చరిత్ర అని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయని చెప్పారు. షా బానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాజీవ్ గాంధీ ఎంతగా తిప్పికొట్టారో దేశం మొత్తానికి తెలుసని అన్నారు. అంతేకాదు సీతారాం కేసరి లాంటి నాయకుడిని చివరి రోజుల్లో ఆయన సామాన్లను వీధిన పడేశారని, ఈ తీరును దేశం మొత్తం గమనించిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ న్యాయ వ్యవస్థను, వెనుకబడిన తరగతులు, వెనుకబడిన సమాజాన్ని గౌరవిస్తారని ఆశించలేమని చౌహాన్ అన్నారు. కాంగ్రెస్ తన అహంకారాన్ని వీడి ఓబీసీలకు క్షమాపణ చెప్పాలని, సత్యాగ్రహానికి బదులు రాహుల్ గాంధీ దేశవ్యాప్త క్షమాపణ యాత్ర చేపట్టాలని శివరాజ్ సింగ్ చౌహాన్ డిమాండ్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..