తొలిసారి జాకెట్‌లో కనిపించిన రాహుల్ గాంధీ.. కశ్మీర్‌లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

By Mahesh KFirst Published Jan 20, 2023, 1:35 PM IST
Highlights

కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడుతూ తొలిసారి జాకెట్ ధరించి కనిపించారు. ఆయన తొలి నుంచి సాధారణ వైట్ టీ షర్ట్ ధరించే కనిపించారు. కఠిన చలిలోనూ ఆయన ఆ సాధారణ టీ షర్ట్ ధరించే పాదయాత్ర చేపట్టారు.
 

శ్రీనగర్: కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ సారథ్యంలో భారత్ జోడో పాదయాత్ర గురువారం జమ్ము కశ్మీర్‌లోకి ప్రవేశించింది. పంజాబ్ నుంచి జమ్ములోకి ఈ యాత్ర ప్రవేశించింది. తీవ్రమైన చలి కాలంలోనూ రాహుల్ గాంధీ వైట్ టీ షర్ట్ ధరించి పాదయాత్ర చేశారు. అంతటి చలిలోనూ రాహుల్ గాంధీ కేవలం టీ షర్ట్‌ ధరించే పాదయాత్ర చేశారు. దీనిపై మీడియా, ఇతర వర్గాల నుంచి అనేక ప్రశ్నలు వచ్చాయి. రాహుల్ గాంధీకి చలి లేదా? వణుకు లేదా? అనే కోణంలో ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తొలిసారి జాకెట్ ధరించి కనిపించారు. జమ్ము కశ్మీర్‌లో ఈ రోజు ఉదయం నుంచి సన్నగా వర్షం పడుతుండగా ఆయన జాకెట్ ధరించి ప్రయాణం ప్రారంభించారు. ఎట్టకేలకు ఆయన తన ఒంటిని చలి నుంచి కాపాడుకోవడానికి జాకెట్ ధరించారు. ఆ తర్వాత మళ్లీ జాకెట్ తొలగించి తన మార్క్ వైట్ టీ షర్ట్‌లోనే పాదయాత్ర చేశారు.

125 రోజుల్లో సుమారు 3,400 కిలోమీటర్ల దూరం రాహుల్ గాంధీ కేవలం సాధారణ దుస్తులు మాత్రమే ధరించడం ఆసక్తి రేపింది. అయితే, తనకు చలి అనిపిస్తే తప్పకుండా వేరే దుస్తులు ధరిస్తానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తన దుస్తులపై కాకుండా ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చ చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. కానీ, ఇప్పటి వరకు ఆయన సాధారణ వైట్ టీ షర్ట్‌ ధరించే కనిపించారు.

Also Read: భార‌త్ జోడో యాత్ర‌లో సంజ‌య్ రౌత్.. ప్ర‌జ‌ల కోసం గ‌ళంవిప్పే నాయ‌కుడంటూ రాహుల్ గాంధీపై ప్ర‌శంస‌లు

ఈ నెల 25న రామ్‌బాన్ జిల్లాలోని బనిహల్‌లో జాతీయ జెండాను రాహుల్ గాంధీ ఆవిష్కరిస్తారు. రెండు రోజుల తర్వాత అంటే 27వ తేదీన శ్రీనగర్ మీదుగా అనంత్‌నాగ్‌లోకి ఎంటర్ అవుతారు.

click me!