ఢిల్లీలో పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న విమానాలు, 16 రైళ్లు..

By SumaBala BukkaFirst Published Jan 20, 2023, 1:30 PM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు కారణంగా విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. 

న్యూఢిల్లీ :  శుక్రవారం పొగమంచు కారణంగా.. విజిబులిటీ తక్కువగా ఉండడం వల్ల ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (ఐజీఐ) విమానాశ్రయంలో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అయితే, ఉదయం 7 గంటల వరకు ఎలాంటి విమాన మళ్లింపులు జరగలేదని వారు తెలిపారు."దేశ రాజధానిలో పొగమంచు కారణంగా, అనుకూలించని వాతావరణం కారణంగా విమానాలు ఆలస్యం అయ్యాయి. విమానాశ్రయంలో విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది" అని ఢిల్లీ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడు తెలిపారు.

ఢిల్లీలో పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న విమానాలు, 16 రైళ్లు..

కాగా, విమానాలే కాదు ఢిల్లీలో పొగమంచు కారణంగా 16 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయని ఉత్తర రైల్వే తెలిపింది. ఉత్తర రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, గయా-న్యూఢిల్లీ మహాబోధి ఎక్స్‌ప్రెస్, మాల్దా టౌన్-ఢిల్లీ ఫరక్కా ఎక్స్‌ప్రెస్, బనారస్-న్యూఢిల్లీ కాశీ విశ్వనాథ్ ఎక్స్‌ప్రెస్, కామాఖ్య-ఢిల్లీ బ్రహ్మపుత్ర మెయిల్, విశాఖపట్నం-న్యూఢిల్లీ ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు 1 గంట ఆలస్యంగా నడుస్తున్నాయి" అని తెలిపారు.

ఢిల్లీలో వచ్చే 2 రోజుల్లో తేలికపాటి వర్షం, పొగమంచు వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిసింది. భారత వాతావరణ శాఖ ప్రకారం, దేశ రాజధానిలో శుక్రవారం ఉదయం పొగమంచుతో సఫ్దర్‌జంగ్, పాలంలో కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

click me!