కాన్పూర్ తల్లీకూతుళ్ల మృతి: బీజేపీ బుల్డోజర్ విధానం ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనమంటూ రాహుల్ గాంధీ ఫైర్

Published : Feb 15, 2023, 11:01 AM IST
కాన్పూర్ తల్లీకూతుళ్ల మృతి:  బీజేపీ బుల్డోజర్ విధానం ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనమంటూ రాహుల్ గాంధీ ఫైర్

సారాంశం

Kanpur: కాన్పూర్ లోని దేహత్ పరిధిలోని మరౌలి గ్రామంలో ఫిబ్రవరి 14న ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్ సందర్భంగా జరిగిన అగ్నిప్రమాదంలో 44 ఏళ్ల మహిళ, ఆమె కుమార్తె  ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.   

Rahul Gandhi Reaction on Kanpur Fire Incident: కాన్పూర్ లో జిల్లా యంత్రాంగం చేపట్టిన ఆక్రమణల‌ వ్యతిరేక డ్రైవ్ లో తల్లీకూతుళ్లు మృతి చెందడంపై స్పందిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. బీజేపీ బుల్డోజ‌ర్ విధానం ప్ర‌భుత్వ క్రూర‌త్వానికి నిద‌ర్శ‌నంగా మారింద‌ని విమ‌ర్శించారు. 'బుల్డోజర్ విధానం ఈ ప్రభుత్వ క్రూరత్వానికి ముఖంగా మారింది. అధికార దురహంకారం ప్రజల జీవించే హక్కును హరించడాన్ని.. నియంతృత్వం పోక‌డ‌ల‌ను అనుస‌రిస్తోంది. ఈ 'బుల్డోజర్ పాలసీ' ఈ ప్రభుత్వ క్రూరత్వానికి నిద‌ర్శ‌నం. దీన్ని భారత్ ఎప్పిటికీ  అంగీకరించ‌దు" అని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌తో త‌న మ‌న‌సు క‌త‌ల చెందింద‌నీ, త‌న‌ను ఎంత‌గానో బాధించింద‌ని తెలిపారు. 

 

 

ప్రియాంక గాంధీ కూడా ప్రభుత్వంపై మండిప‌డ్డారు.. 

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వ బుల్డోజర్లలో అమానవీయత ఉందనీ, ఇది మానవత్వానికి, సున్నితత్వానికి ముప్పుగా మారిందని ఆయన అన్నారు. కాన్పూర్ లో జరిగిన హృదయవిదారక ఘటన ఎంతో బాధించిందని తెలిపారు. "ఈ అమానవీయతకు వ్యతిరేకంగా మనమందరం గళం విప్పాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని" ఆమె అన్నారు.

 

 

అధికారులపై కేసు నమోదు..

కాన్పూర్ దేహత్ ప్రాంతంలోని మరౌలి గ్రామంలో ఆక్రమణ వ్యతిరేక డ్రైవ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 44 ఏళ్ల మహిళ, ఆమె కుమార్తె మరణించారు. మృతులను ప్రమీలా దీక్షిత్ (44), ఆమె కుమార్తె నేహా దీక్షిత్ (22)గా గుర్తించారు. ఈ ఆరోపణల ఆధారంగా ఎస్డీఎం, స్టేషన్ ఆఫీసర్ (ఎస్ఓ), లేఖ్పాల్ సహా డజను మంది అధికారుల‌పై కేసు నమోదు చేశారు.

ఏం జ‌రిగిందంటే..? 

సోమవారం మధ్యాహ్నం మరౌలి గ్రామంలో ఆక్రమణలకు వ్యతిరేకంగా జిల్లా యంత్రాంగం చేపట్టిన కూల్చివేత చర్యలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ చర్యను వ్యతిరేకించిన కుటుంబ సభ్యులు తొలగింపును ఆపడానికి నిప్పంటించుకుంటానని బెదిరించారు. దీంతో కుటుంబ సభ్యులకు, అధికారులకు మధ్య తోపులాట జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లంతా కాలి బూడిదైంది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో నలుగురు ఉన్నారని స‌మాచారం. ఇంట్లో ఉన్న నలుగురిలో ఇద్దరు మృతి చెందగా, మరికొందరికి కాలిన గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. అధికారులు, సంఘ విద్రోహ శక్తులు కావాలనే తమ ఇంటికి నిప్పు పెట్టారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం