మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. అసహజ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలని జూనియర్లకు వేధింపులు...ఎక్కడంటే...

Published : Jul 27, 2022, 01:20 PM IST
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. అసహజ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలని జూనియర్లకు వేధింపులు...ఎక్కడంటే...

సారాంశం

మధ్యప్రదేశ్ లో ర్యాగింగ్ భూతం పడగవిప్పింది. ఇండోర్ లోని మహాత్మా గాంధీ స్మారక మెడికల్ కాలేజీలో అసహజ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలని సీనియర్లు జూనియర్లను వేధింపులకు గురిచేస్తున్నారు. 

మధ్యప్రదేశ్ : Madhya Pradesh లోని ఇండోర్ లో ఉన్న మహాత్మా గాంధీ స్మారక Medical Collegeలో సీనియర్ల దాష్టీకాలు దారుణంగా కనిపిస్తున్నాయి. Abnormal sexual activityల్లో పాల్గొనాలని జూనియర్లను అత్యంత అనాగరికంగా వేధిస్తున్నట్లు కేసు నమోదయ్యింది.  అసభ్యకరంగా, అశ్లీలంగా ప్రవర్తించాలంటూ తీవ్రంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఇండోర్ పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం..  మహాత్మా గాంధీ స్మారక వైద్య కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ helplineకు ఫిర్యాదు చేశారు. 

తమ సీనియర్లు తమను అత్యంత కిరాతకంగా వేధిస్తున్నారని ఆరోపించారు. అసభ్యకరంగా, అశ్లీలంగా ప్రవర్తించాలని వేధించడంతో పాటు, తమను అసహజ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలని నిర్భంధిస్తున్నారని ఆరోపించారు. కళాశాల అధికారులు అందజేసిన లేఖపై స్పందిస్తూ  సంయోగితా గంజ్ పోలీసులు.. కొందరు గుర్తుతెలియని ఎంబీబీఎస్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడిన ట్లు కేసు నమోదు చేశారు. UGC  యాంటీ ర్యాగింగ్ యూనిట్ అందజేసిన సమాచారం మేరకు ఈ కళాశాల అధికారులు స్పందించి.. పోలీసులకు లేఖ రాశారు.

విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగించిన టీచర్లు.. వీడియో వైరల్..

బాధిత విద్యార్థులు తమ ఫిర్యాదుతో పాటు కొన్ని ఫోటోలు,  ఆడియో రికార్డింగ్ లను కూడా జతచేశారు. వేధింపులకు పాల్పడుతున్న సీనియర్ విద్యార్థుల ఫ్లాట్ల లొకేషన్ ను కూడా షేర్ చేశారు. ఈ ఫ్లాట్ లలో సీనియర్ విద్యార్థులు.. జూనియర్ విద్యార్థులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తరగతులు ముగిసిన తర్వాత తమను వారు నివసిస్తున్న ఫ్లాట్ లలోకి రావాలని సీనియర్లు ఆదేశిస్తున్నారని జూనియర్లు తెలిపారు. సీనియర్ల ఫ్లాట్లకు ఆలస్యంగా వెళితే జూనియర్ లతో గుంజీలు తీయిస్తున్నారని తెలిపారు. ఈ హింస, వేధింపులు చాలా దారుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. 

తమ తోటి విద్యార్థినుల గురించి అశ్లీలంగా మాట్లాడేలా నిర్భంధిస్తున్నారని, ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకోవాలని హింసిస్తున్నారని పేర్కొన్నారు. చెంపదెబ్బ శబ్దం సీనియర్లకు సంతృప్తికరంగా ఉండేవరకు కొట్టుకోవాలని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాగింగ్ కేవలం సీనియర్ల ప్లాట్లకు మాత్రమే పరిమితం కాలేదని, గ్రంథాలయం, క్యాంటీన్ వంటి వాటికి కూడా తమను వెళ్లనివ్వడం లేదని జూనియర్లు ఆరోపించారు. చివరికి వాటర్ కూలర్ లలో నీటిని కూడా తాగనివ్వడం లేదన్నారు. ఈ దుర్మార్గాలను కొందరు ప్రొఫెసర్లు కూడా సమర్ధిస్తున్నారని వ్యక్తిత్వ వికాసం అని అభివర్ణిస్తున్నారు అని చెప్పారు.

ఎంజిఎంఎంసి డీన్ డాక్టర్ సంజయ్ దీక్షిత్ మాట్లాడుతూ.. తమకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు అందిన వెంటనే ర్యాగింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించామన్నారు. ప్రాథమిక సమాచార నివేదికను ఎండార్స్ చేసి,  పోలీసులకు పంపించామని తెలిపారు. పోలీసులు తన స్టేట్ మెంట్ రికార్డు చేశారని, ప్రథమ సంవత్సరం ఎంబిబిఎస్ విద్యార్థుల వివరాలను కోరారని డే బోర్డర్స్, హాస్టల్స్ వివరాలు కోరారని చెప్పారు. దాదాపు ఓ నెల క్రితం హాస్టల్ నుంచి వెళ్లిపోయిన విద్యార్థుల వివరాలను కూడా కోరారని చెప్పారు. సంయోగితగంజ్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ మాట్లాడుతూ సీఆర్పీసీ సెక్సన్ 91 ప్రకారం తాము నోటీసు జారీ చేశామని అన్నారు. దర్యాప్తు జరుగుతోందని చెప్పుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

2026 Sankranthi celebrations in Delhi | PM Modi Powerful Pongal Speech | Asianet News Telugu
Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu