
న్యూఢిల్లీ: Parliament ఉభయ సభల్లో విపక్షాల ఆందోళనలు కొనసాగుతన్నాయి. నిత్యావసర సరుకుల ధరల పెంపు సహా పలు అంశాలపై విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్ష ఎంపీలు ఆందోళనలు నిర్వహించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి వివిధ పార్టీలకు చెందిన 19 మంది Rajya Sabha ఎంపీలను నిన్న సస్పెండ్ చేశారు. వారం రోజుల పాటు ఎంపీలను రాజ్యసభ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
Lok sabha నుండి Congress పార్టీకి చెందిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలను Suspend చేసిన విషయం తెలిసిందే. వర్షాకాల సమావేశాలు ఈ నెల 18న ప్రారంభమయ్యాయి.ఈ ఏడాది ఆగష్టు 12న ముగియనున్నాయి.
ఇవాళ రాజ్యసభలో ఆందోళన చేస్తున్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను సభ నుండి సస్పెండ్ చేస్తూ రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత రాజ్యసభ ఇవాళ మద్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. లోక్ సభ కూడా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.
ఇదిలా ఉంటే ఎంపీలపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ధరల పెంపుపై చర్చ జరగాలని తాము డిమాండ్ చేస్తున్నామని విపక్ష నేతలు చెబుతున్నారు.