ప్రపంచ శాంతి కోసమే ఈ క్వాడ్ సమావేశం.. ప్రధాని నరేంద్రమోదీ

By telugu news teamFirst Published Sep 25, 2021, 8:46 AM IST
Highlights

 ఈ క్వాడ్ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దన్యవాదాలు తెలిపారు.

భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ  సందర్భంగా మోదీ అక్కడ క్వాడ్ సమావేశంలో పాల్గొన్నారు. మోదీతోపాటు,. నాలుగు దేశాల ప్రతినిధులు.. వాషింగ్టన్ డీసీలో మొదటిసారి వ్యక్తిగతంగా కలుసుకున్నారు.  అక్కడ వారు కోవిడ్ 19 కారణంగా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను వీరు చర్చించారు.

కాగా.. ఈ క్వాడ్ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దన్యవాదాలు తెలిపారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా కూడా ఉన్నారు.

ఇండో-పసిఫిక్ ప్రాంతానికి సహాయం చేయడానికి తమ నాలుగు దేశాలు 2004 సునామీ తర్వాత మొదటి సారి కలుసుకున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు ప్రపంచం కోవిడ్ 19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు మానవజాతి సంక్షేమానికి క్వాడ్ గా తాము మరోసారి ఇక్కడకు వచ్చామని మోదీ పేర్కొన్నారు. క్వాడ్ లో తాము పాల్గొనడం వల్ల ప్రపంచంలో శాంతి, శ్రేయస్సు ఏర్పడుతుందని  తమకు నమ్మకం ఉందని మోదీ పేర్కొన్నారు. 

కాగా.. ఈ క్వాడ్ సమావేశంలో భాగంగా ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడారు. నాలుగు ప్రజాస్వామ్య దేశాలు అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ లు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు చెప్పారు. కోవిడ్ సమయంలోనూ.. ఇతర సమస్యల విషయంలోనూ తామంతా కలిసి పోరాడామని,.  ఉమ్మడి సవాళ్లను స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు బైడెన్ తెలిపారు. పనులు ఎలా పూర్తి చేయాలో తమకు బాగా తెలుసు అని.. సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసు అని ఆయన చెప్పారు.
 

click me!