గవర్నర్ vs ప్రభుత్వం: బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకు ఇలా.. ?

Published : Sep 22, 2022, 12:21 PM ISTUpdated : Sep 22, 2022, 12:27 PM IST
గవర్నర్ vs ప్రభుత్వం: బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకు ఇలా.. ?

సారాంశం

Governor vs government: తాజాగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గవర్నర్-ప్రభుత్వం మధ్య గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతకుముందు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 11 బిల్లులలో రెండింటిపై సంతకం చేయడానికి గవర్నర్ నిరాకరించారు. అందులో ఒకటి విశ్వవిద్యాలయ చట్టాల (సవరణ) బిల్లు కూడా ఉంది.  

Governor vs government: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతరాలు పెరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్‌లను నియమించిన సంఘటనలు పెరుగుతూ.. రాష్ట్రాలలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య గొడవలు అనేవి సర్వసాధారణంగా మారుతున్నాయి. దీంలో ప్రజలకు మెరుగైన పాలన అందడంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతకుముందు గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్.. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 11 బిల్లులలో రెండింటిలో సంతకం చేయడానికి నిరాకరించారు. వాటిలో ఒకటి, విశ్వవిద్యాలయ చట్టాల (సవరణ) బిల్లు కూడా ఉంది. అయితే, ఇది విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా తన అధికారాన్ని తగ్గించడానికి ప్రయత్నించే చర్యలుగా ఆయన ఆరోపించారు. 

కన్నూర్ యూనివర్శిటీకి సీఎం వ్యక్తిగత కార్యదర్శి బంధువు నియామకాన్ని ఉటంకిస్తూ, ముఖ్యమంత్రిపై గవర్నర్ వ్యక్తిగత ఆరోపణలు చేయడం బహుశా మొదటిసారిగా చూసిన ప్రతిష్టంభన కావచ్చు. ఎందుకంటే.. రాజ్యాంగ పదవిలో ఉన్నఆయన తన సమావేశాలన్నింటినీ.. రాజకీయ ప్రవేయాలను దూరంగా ఉండకుండా.. విలేకరుల సమావేశం నిర్వహించడంతో గవర్నర్-ప్రభుత్వ వివాదం మరింత ముదిరింది. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ.. 'ఎల్‌డిఎఫ్‌ని నడిపించే భావజాలం భారతదేశం వెలుపల ఉద్భవించింది' అని ఫ్రంట్‌పై తీవ్రమైన ఆక్షేపణలను కూడా వ్యక్తం చేశారు. గతంలో కన్నూర్ వర్సిటీ వైస్ ఛాన్సలర్‌ను క్రిమినల్‌గా పేర్కొన్న ఖాన్, మాజీ వీసీ, ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్‌పై కూడా 'గూండా' అంటూ ఆరోపణలు చేశారు.

ఒక్క కేరళలోనే కాదు బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ vs ప్రభుత్వం వివాదం కొనసాగుతోంది. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్‌లలో గవర్నర్‌లు 'బీజేపీకి రాజకీయ అధికారులు'గా వ్యవహరిస్తున్నారని ఒక సంపాదకీయంలో పేర్కొంటూ, అధికార CPI (M), దాని మిత్రపక్షాలు CPI పార్టీ ఆర్గాన్, న్యూ ఏజ్‌తో ప్రతిస్పందించాయి. ప్రజాస్వామ్య ప్రాథమిక సిద్ధాంతాలను ఉల్లంఘిస్తూ, రాజకీయాలకు అతీతంగా బాధ్యతలు నిర్వర్తించాల్సిన గవర్నర్లు ఇప్పుడు ‘సంఘ్ పరివార్ మంచి పుస్తకాల్లో’ ఒకరితో ఒకరు పోటీ పడడం సిగ్గుచేటని అన్నారు. ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్న సమయంలో రాజ్‌భవన్ 'నిఘాలో' ఉందని ఆరోపిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నియమించిన కుముద్బెన్ మణిశంకర్ జోషి, NT రామారావు నేతృత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మధ్య జరిగిన ప్రతిష్టంభన వంటి ఆందోళనకరమైన ధోరణి.. కేంద్రంలో బీజేపీ సర్కారుకు ముందు భారతదేశంలో చాలా తక్కువగా అలాంటి సందర్భాలు ఉన్నాయి. అయితే, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ vs ప్రభుత్వం వివాదం ధోరణి క్రమంగా పెరుగుతున్న పరిస్థితులు ఉన్నాయని వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. ఇటీవల పలు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న ఘటనలే దీనికి నిదర్శనం. 

దీనికి తోడూ గవర్నర్లుగా మాజీ రక్షణ లేదా పోలీసు సిబ్బంది, బ్యూరోక్రాట్‌లను నియమించే ధోరణికి కూడా గుడ్ బై చెప్పిందనీ, కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత, 2018 నాటికి, కాషాయపార్టీతో అనుబంధంలేని బీజేపీయేతర గవర్నర్‌లను నియమకాలు మూడు మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఖాన్ కంటే ముందు, ఇటీవలి కాలంలో సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వంతో పదే పదే తలపడడం, వారిలో చాలా మంది రాజకీయంగా ప్రేరేపితమై అధికార టీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకోవడం పతాక శీర్షికలకు ఎక్కింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఆమె నిరంతర వ్యాఖ్యలు పెద్ద ఎత్తున విమర్శలకు దారితీశాయి. ప్రత్యేకించి  తెలంగాణ ఇప్పటికే వివిధ అంశాలలో కేంద్రం నుండి వివక్షను ఎదుర్కొంటోంది. గవర్నర్లు కేంద్రానికి ఏజెంట్లుగా వ్యవహరిస్తూ, ముఖ్యమంత్రులతో ఘర్షణకు దిగడం, సీఎంలను ఎన్నుకునేటప్పుడు (గోవా), రోజువారీ పరిపాలనలో జోక్యం చేసుకోవడం, అసెంబ్లీలలో ఆమోదించిన బిల్లులకు ఆలస్యం చేయడం లేదా ఆమోదం నిరాకరించడం, విధానాలపై ప్రతికూలంగా వ్యాఖ్యానించడం వంటివి ఉంటున్నాయి. కాగా, 1968 నాటి పరిపాలనా సంస్కరణల కమిషన్, 1969 నాటి పివి రాజమన్నార్ కమిటీ, 1971లో గవర్నర్ల కమిటీ, 1988లో సర్కారియా కమిషన్ సిఫార్సుల ద్వారా కేంద్ర-రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయడానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే, గవర్నర్లు ఒక పార్టీకి విధేయులుగా ఉండటానికి.. వారి నుంచి ప్రశంసలు పొందడానికి ప్రయత్నాలు ఈ విధంగా చేయడం ఆందోళన కలిగించే అంశంగా మారుతున్నది.అలాగే, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రజలకు శాపంగా మారుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..