
కోయంబత్తూరు : పుష్ప సినిమా తరహాలో గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేస్తున్న ఓ ట్రక్కును కోయంబత్తూర్ పోలీసులు అత్యంత సాహసోపేతంగా ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ట్రక్కులోపల రహస్య గదిని ఏర్పాటు చేసి మరీ గంధపు చెక్కలను తరలిస్తున్నారు. ఈ ట్రక్కు ఆంధ్రప్రదేశ్ కు వస్తుండడం గమనార్హం.
కోయంబత్తూరు పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ టి జెసిస్ ఉదయరాజ్ నేతృత్వంలోని కోయంబత్తూరు నగర పోలీసు బృందం గంధపు చెక్కల ట్రక్కును 150 కిలోమీటర్లు చేజ్ చేసి మరీ పట్టుకుంది. ఈ ట్రక్కులో టన్ను కంటే ఎక్కువ గంధపు దుంగలు ఉన్నట్లు గుర్తించింది.
"రాజకీయ లబ్ది కోసం ప్రధాని ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడతాడు"
సేలం జిల్లా అత్తూర్‌లో ఓ వాహనాన్ని గుర్తించిన పోలీసు బృందం అనుమానంతో చేజ్ చేసి గంధపు దుంగలు ఉన్న వాహనాన్ని స్వాధీనం చేసుకుంది. తదుపరి విచారణ నిమిత్తం డ్రైవర్, వాహనాన్ని మదుక్కరై అటవీ రేంజ్ కార్యాలయం పి.సంతియాకు అప్పగించారు. గంధం స్మగ్లింగ్‌పై పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఈ ప్రయాణం సాగింది.
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. మంగళవారం తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతంలో ఎల్‌అండ్‌టీ బైపాస్ రోడ్డులోని ఓ బేకరీ సమీపంలో ఎస్‌ఐ జేసీస్ ఉదయరాజ్, హెడ్ కానిస్టేబుల్ రమేష్, పోలీస్ కానిస్టేబుల్ ఆనందకుమార్ వాహన తనిఖీలు నిర్వహించారు. దీంట్లో భాగంగా అక్కడికి వస్తున్న వాహనాలను ఆపుతున్నారు. కాగా వారు ఒక ట్రక్కును అడ్డగించేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ వాహనాన్ని ఆపలేదు.
ఆపకుండా స్పీడ్ గా పోలీసులను దాటుకుంటూ వెళ్లిపోయాడు. ఆ వాహనాన్ని పట్టుకోవడానికి కోయంబత్తూరు, తిరుపూర్, ఈరోడ్, సేలం జిల్లాల పోలీసులను అప్రమత్తం చేయలేదు. అలా చేయకుండా పోలీసు బృందమే స్వయంగా ఒక క్యాబ్‌ను అద్దెకు తీసుకుని.. ట్రక్కును వెంబడించారు.
కేరళలోని మలప్పురానికి చెందిన ట్రక్ డ్రైవర్ మనోజ్ (52) మొబైల్ నంబర్ ను పోలీసులు సేకరించారు. అతను సేలం జిల్లాలో బ్రికెట్లను వాహనంలో ఎక్కించాడు. అత్తూరు వద్ద వాహనాన్ని అడ్డగించి డ్రైవర్ మనోజ్‌ను ప్రశ్నించగా పరస్పర విరుద్ధంగా సమాధానమిచ్చాడు. ఆ తరువాత ఉదయం 11 గంటలకు వాహనాన్ని కోయంబత్తూరుకు తీసుకువచ్చాం”అని ఎస్‌ఐ జెసిస్ ఉదయరాజ్ తెలిపారు.
గంధపు చెక్కలను పెట్టేందుకు ట్రక్కులో రహస్య గదిని కూడా ఏర్పాటు చేశారు. మలప్పురం వద్ద ట్రక్కుల్లో చందనాన్ని ఎక్కించుకుని ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్నట్లు జెసిస్ తెలిపారు. మంగళవారం సాయంత్రం అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ కరికల్ పరి శంకర్ (పోదనూరు రేంజ్), ఇన్‌స్పెక్టర్ నటేశన్, బృందం 1051 కిలోల గంధపు చెక్కలతో ఉన్న ట్రక్కును, దాన్ని నడుపుతున్న డ్రైవర్‌ను అటవీ సంరక్షణాధికారి ఎస్ రామసుబ్రమణియన్, ఫారెస్ట్ అసిస్టెంట్ కన్జర్వేటర్ దినేష్ కుమార్, ఎం సెంథిల్ కుమార్, ఫారెస్ట్ రేంజ్ అధికారులు పి శాంతియ, ఆర్ అరుణ్ కుమార్ లకు అప్పగించారు.