"రాజకీయ లబ్ది కోసం ప్రధాని ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడతాడు" 

Published : Aug 02, 2023, 12:55 PM IST
"రాజకీయ లబ్ది కోసం ప్రధాని ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడతాడు" 

సారాంశం

Satyapal Malik:ప్రధాని మోదీపై, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.  అధికారం కోసం ప్రధాని మోదీ ఎంతకైనా తెగిస్తాడని అన్నారు. ఎన్నికల ముందు బాంబులు పేలొచ్చు లేదా ఎవరైనా ప్రముఖ బీజేపీ నేత హత్య జరగవచ్చు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.   

Satyapal Malik:ప్రధాని మోదీపై, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరో సారి సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ మైలేజీని పొందేందుకు ఇద్దరూ (పీఎం మోదీ, బీజేపీ) ఎంతకైనా తెగిస్తారని ఆరోపించారు. తాజాగా న్యూస్‌క్లిక్‌ అనే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ.. అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ  సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాజకీయ లబ్ది పొందడానిక కోసం ఎంతటి  దుర్మార్గానికైనా పాల్పడవచ్చనీ, రాజకీయ వ్యూహంలో భాగంగా రామ మందిరంపై దాడి చేయడమో లేదా ఏ బిజెపి అగ్ర నాయకుడిని చంపడానికి ప్రయత్నించవచ్చని సత్యపాల్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు.  

ప్రధాని మోదీ క్రూరమైన ఎన్నికల వ్యూహంపై విరుచుకుపడిన మాలిక్.. 2019 పుల్వామా దాడి గురించి ప్రస్తావించారు. పుల్వామా దాడిని ప్రధాని మోదీ ఉద్దేశపూర్వకంగా చేయించారని ఆరోపించారు. ఎలాంటి ఘటనలను నిర్వహించగల సామర్థ్యం ఉన్న ఎవరైనా రాజకీయ లక్ష్యాలను సాధించడానికి ఏదైనా చేస్తారని ఆయన అన్నారు. నిర్దాక్షిణ్యంగా పాలించడం ప్రధాని మోదీకి  చాలా బాగా తెలుసని సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు.

2024 ఎన్నికల్లో ప్రధాని మోడీ విజయం సాధించలేరనీ, ఆయన ఇప్పుడే రాజీనామా చేస్తే మంచిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ లోపాలపై ప్రధాని మోదీ మౌనం వహించారనీ, అంతకుముందు.. పుల్వామా దాడిపై మౌనం వహించాలని తనను కోరారని మాలిక్ వాదించారు. ది వైర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సిఆర్‌పిఎఫ్ తమ సిబ్బందిని తీసుకెళ్లేందుకు విమానం కావాలని కోరిందని, కానీ, రక్షణ మంత్రిత్వ శాఖ నిరాకరించిందని చెప్పారు. 2019లో దాడి జరిగినప్పుడు మాలిక్ జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా వ్యవహరించారు. 

అదే సమయంలో మణిపూర్ హింసపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.  దుర్మార్గులకు ఆయుధాలు అందించడం ద్వారా రాష్ట్రంలో అరాచకాలను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ఎందుకు తాను ఖచ్చితంగా చెప్పుతున్నంటే.. హింసాత్మక ఘటనలో దుర్మాగులు ఉపయోగించి ఆయుధాలు సామాన్యులకు అంత తేలికగా అందుబాటులో ఉండవని అన్నారు. INSAS రైఫిళ్లు మార్కెట్లో అందుబాటులో లేవని, ప్రభుత్వ పదాతిదళంలో లేవని వ్యాఖ్యానించారు. అయితే, మణిపూర్‌లో గుంపులు పెద్ద మొత్తంలో ఆయుధాలను దోచుకున్నారనే వాదనలను కూడా ఆయన తోసిపుచ్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !