
పంజాబ్‌లో జరిగిన ఓ ఘటన మందుబాబుల గుండెలను పిండేస్తుందనడంలో ఎలాంటి సందేశం లేదు. అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేశారు. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై రోడ్డు రోలర్‌తో తొక్కించి మద్యం సీసాలన్నిటిని ధ్వంసం చేశారు. ఈ ఘటన పంజాబ్‌లోని లూథియానాలోని చేసుకుంది. మద్యం, మత్తు పదార్థాల విక్రయాలపై పోలీసులు, ఎక్సైజ్ శాఖ ఉక్కు పాదం మోపారు. ఈ రెండు శాఖలు సంయుక్తంగా జరిపిన దాడిలో గోడౌన్‌లో 600 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ETO అమిత్ గోయల్ మీడియాకు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. పంజాబ్‌లోని లూథియానాలో ఎక్సైజ్,టాక్సేషన్ డిపార్ట్‌మెంట్,పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో గురువారం సాయంత్రం ఒక గోడౌన్ నుండి 600 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో దాదాపు రూ. 85 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని, రోడ్‌రోలర్‌తో ధ్వంసం చేశారు. అసిస్టెంట్ ఎక్సైజ్ అండ్ ట్యాక్సేషన్ కమిషనర్ (ఏఈటీసీ) హర్‌సిమ్రత్ గ్రేవాల్ నేతృత్వంలో దాడులు నిర్వహించారు. ఏఈటీసీ తో పాటు ఈటీవో దీవాన్ చంద్, ఇతర అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఇషార్‌సింగ్ నగర్‌లోని సిమెంట్ గోడౌన్లలో భారీ మొత్తంలో మద్యం, వివిధ బ్రాండ్ల బీర్లు నిల్వ ఉంచినట్లు పక్కా సమాచారం అందిందని గ్రేవాల్ తెలిపారు. ఎక్సైజ్ బృందం దాడులు నిర్వహించగా నాలుగు గోడౌన్లకు తాళాలు వేసి కనిపించాయి. గోడౌన్‌లను యజమాని అద్దెకు ఇచ్చినందున, అద్దెదారు అందుబాటులో లేకపోవడంతో, గోడౌన్ యజమానిని సంఘటనా స్థలానికి పిలిపించి.. షట్టర్‌ల తాళాలు తెరిచినట్లు ఎఇటిసి తెలిపారు.
రూ.85 లక్షల విలువైన మద్యం ధ్వంసం
ఎంపీ ఇండోర్‌లో రూ.85 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. మద్యం స్టాక్‌లో 3,146 కార్టన్‌లలో దేశీ మద్యం, విస్కీ , బీరు ఉన్నాయి. ఇవి రోడ్డు రోలర్ కింద నలిగిపోయాయని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అక్షయ్ మార్కం తెలిపారు. ఈ మద్యాన్ని అధికారులు సీజ్ చేశారని, నిబంధనల ప్రకారం ధ్వంసం చేశారని తెలిపారు.