చండీగఢ్, మొహాలీలకు ఉగ్రదాడుల హెచ్చరిక.. అప్రమత్తమైన పంజాబ్ పోలీసులు

By Siva KodatiFirst Published Aug 21, 2022, 2:25 PM IST
Highlights

పంజాబ్‌లోని చండీగడ్, మొహాలీ నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం వుందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఆ రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలక ప్రాంతాల్లో నిఘా పెట్టి.. తనిఖీలు చేపడుతున్నారు. 

పంజాబ్‌లోని చండీగడ్, మొహాలీ నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం వుందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఆ రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. బస్టాండ్‌లు, జనసమ్మర్దం వుండే ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశంలోని భద్రతా సంస్థలు అప్రమత్తంగానే వుంటున్నాయి. భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు ముష్కర మూకలు ఆయుధాలు, పేలుడు సామాగ్రిని పంపుతున్నాయని గుర్తించి వీటికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. 

ఇకపోతే.. ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ సెల్‌కు శుక్రవారం రాత్రి వచ్చిన ఓ మెసేజ్ కాల్‌ తీవ్ర కలకలం రేపింది. కంట్రోల్ సెల్‌కు గుర్తుతెలియని వ్యక్తి.. 26/11 అటాక్స్ లేదా ఉదయ్‌పూర్‌లో టైలర్ హత్య లేదా సిద్దూ మూసేవాలా హత్య లాంటి దాడులు జరుగుతాయని బెదిరింపు సందేశం పంపాడు. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ న్యూస్ 18 రిపోర్ట్ చేసింది. ట్రాఫిక్ కంట్రోల్ సెల్ వాట్సాప్ నెంబర్‌కు వచ్చిన బెదిరింపు సందేశం పాకిస్తాన్ నెంబర్ నుంచి వచ్చినట్టుగా అత్యంత విశ్వసనీయ వర్గాల తెలిపినట్టుగా పేర్కొంది.

Also Read:26/11 తరహా దాడికి పాల్పడుతాం.. ముంబై పోలీసులకు బెదిరింపు మెసేజ్.. పాక్‌లో నెంబర్ లోకేషన్!

తనని స్థానాన్ని గుర్తించినట్లయితే' అది బయట ఉన్నట్టుగా తేలుతుందని మెసేజ్ పంపిన వ్యక్తి చెప్పాడు. ముంబైలో దాడి జరుగుతుందని మెసేంజర్ బెదిరించాడు. ‘‘భారత్‌లోని ఆరుగురు వ్యక్తులు దాడికి పాల్పడతారు’’ అని తెలిపాడు. ఈ బెదిరింపు సందేశంపై భద్రతా బలగాలు విచారణ జరుపుతున్నాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

‘‘మేము దీనిని పరిశీలిస్తున్నాము. రాత్రి నుంచి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇతర ఏజెన్సీలకు కూడా సమాచారం అందించబడింది”అని ఆ వర్గాలు తెలిపాయి. ఇది ఫ్రాంక్ సందేశమా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నాయి. 

రాష్ట్ర ప్రభుత్వం ఈ బెదిరింపు తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత అజిత్ పవార్ అన్నారు. ఈ విషయంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా స్పందించారు. ‘‘మొదట రాయగడ తీరంలో బోటు రికవరీ, ఇప్పుడు పోలీసుల బెదిరింపు సందేశం. మహారాష్ట్రలో ఏం జరుగుతోంది?’’ అని ఆమె ప్రశ్నించారు. 

ఇక, ఇటీవల రాయగఢ్‌లోని హరిహరేశ్వర్‌ బీచ్‌లో అనుమానాస్పద బోటును పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో మూడు ఏకే 47లు, పెద్ద మొత్తంలో బుల్లెట్లు, మరికొన్ని తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన చోటుచేసుకున్న రెండు రోజుల తర్వాత తాజా బెదిరింపులు రావడంతో అధికారులు ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించారు

click me!