మొరాయిస్తున్న పీఎం కేర్ వెంటిలేటర్లు.. కుప్పలు కుప్పలుగా వృథాగా

By Siva KodatiFirst Published May 12, 2021, 4:03 PM IST
Highlights

కరోనా బాధితుల కోసం ప్రధానమంత్రి కేర్స్‌కు పెద్ద ఎత్తున నిధులు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ నిధుల ద్వారా తీసుకొచ్చిన వెంటిలేటర్లు వృథాగా పడి ఉన్నాయి. అవి సక్రమంగా పని చేయడం లేదంటూ వైద్యులు ఓ మూలకు పడేశారు.

కరోనా బాధితుల కోసం ప్రధానమంత్రి కేర్స్‌కు పెద్ద ఎత్తున నిధులు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ నిధుల ద్వారా తీసుకొచ్చిన వెంటిలేటర్లు వృథాగా పడి ఉన్నాయి. అవి సక్రమంగా పని చేయడం లేదంటూ వైద్యులు ఓ మూలకు పడేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పీఎం కేర్‌ నిధుల నుంచి తీసుకొచ్చిన వెంటిలేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం వెంటిలేటర్లు ఇస్తే ఎలాంటి ఉపయోగం వుండదని ఆయన ఎద్దేవా చేశారు.

వివరాల్లోకి వెళితే.. పీఎం కేర్‌ నిధుల నుంచి అగ్వా హెల్త్‌ కేర్‌ కార్యక్రమంలో భాగంగా పంజాబ్‌ రాష్ట్రానికి గతేడాది 250 వెంటిలేటర్స్‌ పంపించారు. వాటిని రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. అయితే పంపించిన వెంటిలేటర్లలో చాలా వరకు పని చేయడం లేదని పక్కన పడేశారు.

గురు గోబింద్‌ సింగ్‌ వైద్య కళాశాల, ఆస్పత్రికి 80 వెంటిలేటర్స్‌ పంపించాల్సి ఉండగా 71 పంపారు. అయితే వాటిలో ఒక్కటీ కూడా పని చేయడం లేదని ఆ కళాశాల వైస్ ఛాన్సలర్ ఆరోపించారు. గంటా రెండు గంటలు పని చేయగానే అవి మొరాయిస్తాయని ఆయన తెలిపారు.

దీంతో గత్యంతరం లేక వాటిని పక్కన పడేసినట్లు చెప్పారు. ప్రభుత్వం పంపిన వెంటిలేటర్లు నాసిరకమైనవని.. అవి కొంత సేపు పని చేసి ఆగిపోతున్నాయని పలు ఆస్పత్రులు సైతం ఫిర్యాదు చేశాయి. దీనిపై అధికార వర్గాలు స్పందించాల్సి వుంది. 

click me!