Punjab Election 2022: పంజాబ్ లో సస్పెన్స్‌కు తెర: ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్

By Rajesh KFirst Published Jan 18, 2022, 1:01 PM IST
Highlights

Punjab Election 2022: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవ‌రూ  అన్న సస్పెన్స్ కు తెరదించింది ఆమ్ ఆద్మీ పార్టీ. పంజాబ్ సీఎం అభ్యర్థి పేరుగా భ‌గ‌వంత్ మాన్ పేరును ప్రకటించారు ఢిల్లీ సీఎం. ప్ర‌స్తుతం  భగవంత్ మాన్  సంగ్రూర్ నియోజకవర్గానికి లోక్ సభ ఎంపీగా ఉన్నారు. వచ్చే నెల పంజాల్ లో ఎన్నికలు జరగనున్నాయి.  

Punjab Election 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొద‌లైంది. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారంలో ఉండటంతో మ‌రింత ప్రాధాన్యత ఏర్పడింది. దేశ రాజ‌కీయ స్థితిగ‌తుల‌ను ప్ర‌భావితం చేసే రాష్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డంతో అంద‌రి దృష్టి ఈ ఎన్నిక‌ల మీద ప‌డింది. ప్ర‌ధానంగా  ఉత్తర ప్రదేశ్, పంజాబ్ సహా ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌‌‌లల్లో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జ‌రుగ‌నున్నాయి.
 
ఈ క్రమంలో పంజాబ్ లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాల‌ని అప్ అధిష్టానం ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలో అప్ ఓట‌ర్ల నాడీ తెలుసుకోవ‌డానికి ఓ వినూత్న నిర్వ‌హించారు. త‌మ  పార్టీ నుంచి పోటీ చేసే సీఎం అభ్య‌ర్థిని మీరే సూచించాలని ప్రజలను కోరారు. ఈ మేర‌కు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఓ వినూత్న స‌ర్వేను చేసింది. ఈ నెల 17 తేదీ సాయంత్రం 5 గంటల్లోపు 70748 70748 ఫోన్​ నంబరుకు ఫోన్​ లేదా మెసేజ్​ చేసి ప్రజలు తమ సూచనలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ యాప్​ను లాంచ్ చేసినట్లు తెలిపారు.

ఈ స‌ర్వే ఫ‌లితాల ఆధారంగా  ఆమ్ ఆద్మీ పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్ర‌క‌టించి సస్పెన్స్ కు తెరదించింది. త‌మ పార్టీ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరును ఆప్ ప్రకటించింది. ప్రజాభిప్రాయ సేకరణలో 93.3 శాతం మద్దుతు భగవత్ మాన్ కు లభించిందని అప్ క‌న్వీన‌ర్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.  ఇప్ప‌టికే భగవంత్ మాన్ పంజాబ్‌లోని సంగ్రూర్ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు

అప్ స‌ర్వేలో పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ పేరిట దాదాపు 3 శాతం ఓట్లు పోలయ్యాయ‌ని.. కేజ్రీవాల్  ప్రకటించారు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ గెలుస్తుందని స్పష్టంగా అర్థమైందని,  ఒక విధంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైన వ్యక్తి పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రి అవుతాడ‌ని కేజ్రీవాల్ అన్నారు.  గ‌త అసెంబ్లీ పోరులో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లోని 117 సీట్ల‌లో 20 స్థానాల‌ను గెలిచింది.

click me!